తిరుమ‌ల‌లో తొలిసారి హ‌నుమ‌జ్జ‌యంతి ఉత్స‌వాలు

  • ఈ నెల 25 నుంచి 4 రోజుల పాటు నిర్వ‌హ‌ణ‌
  • అంజ‌నాద్రి, జాపాలి, నాద నీరాజ‌న వేదిక‌, వేద పాఠ‌శాల‌ల్లో వేడుక‌లు
  • ఏర్పాట్ల‌ను ప‌రిశీలించిన టీటీడీ అద‌న‌పు ఈవో ధ‌ర్మారెడ్డి
క‌లియుగ దైవం శ్రీవేంకటేశ్వ‌ర స్వామి కొలువై ఉన్న తిరుమ‌ల‌లో తొలిసారిగా హ‌నుమ‌జ్జ‌యంతి ఉత్సవాలు జ‌ర‌గ‌నున్నాయి. తిరుమ‌ల చ‌రిత్ర‌లోనే తొలిసారిగా నిర్వ‌హించ‌నున్న హ‌నుమ‌జ్జ‌యంతి ఉత్స‌వాలు ఈ నెల 25 నుంచి 29 వ‌ర‌కు నాలుగు రోజుల పాటు నిర్వ‌హించ‌నున్నారు. ఈ మేర‌కు శ‌నివారం టీటీడీ అద‌న‌పు ఈవో ధ‌ర్మారెడ్డి ఓ కీల‌క ప్ర‌క‌ట‌న చేశారు. 

తిరుమ‌ల కొండ‌పై అంజ‌నాద్రి, జాపాలి, నాద నీరాజ‌న వేదిక‌, వేద పాఠ‌శాల‌ల్లో ఈ వేడుక‌లను నిర్వ‌హించనున్న‌ట్లు ధ‌ర్మారెడ్డి తెలిపారు. ఈ ప్రాంతాల్లో ఉత్స‌వాల నిర్వ‌హ‌ణ‌కు సంబంధించి జ‌రుగుతున్న ఏర్పాట్ల‌ను ఆయ‌న శ‌నివారం ప‌రిశీలించారు. ఉత్స‌వాల‌ను ఘ‌నంగా నిర్వ‌హించేలా ప‌క‌డ్బందీగా ఏర్పాట్ల‌ను చేయాల‌ని ఆయ‌న అధికారుల‌ను ఆదేశించారు.


More Telugu News