రాహుల్ గాంధీ టూర్ జోష్ నింపింది: కాంగ్రెస్ ఎంపీ ఉత్తమ్ కుమార్ రెడ్డి
- ఎన్నికలకు ఆరు నెలల ముందే అభ్యర్థులను ప్రకటిస్తామన్న ఉత్తమ్
- ప్రకాశ్ రాజ్ ఓ బఫూన్ వంటివాడని వ్యాఖ్య
- కేసీఆర్ మెప్పుకోసమే నోటికొచ్చినట్టు మాట్లాడుతున్నారన్న ఉత్తమ్
కాంగ్రెస్ పార్టీ అగ్ర నేత రాహుల్ గాంధీ రెండు రోజుల పాటు జరిపిన తెలంగాణ పర్యటన శనివారం మధ్యాహ్నం ముగిసిన సంగతి తెలిసిందే. ఈ పర్యటనపై టీపీసీసీ మాజీ చీఫ్, నల్లగొండ ఎంపీ ఉత్తమ్ కుమార్ రెడ్డి తాజాగా స్పందించారు.
రాహుల్ గాంధీ పర్యటన పార్టీ శ్రేణుల్లో కొత్త ఉత్సాహం నింపిందని ఆయన చెప్పారు. రెండు రోజుల పాటు రాష్ట్రంలో పర్యటించిన రాహుల్ గాంధీ పార్టీ శ్రేణుల్లో జోష్‌ను నింపారని ఉత్తమ్ చెప్పారు. పనిచేసే వారికే టికెట్లు వస్తాయన్న రాహుల్ గాంధీ చెప్పిన వ్యాఖ్యలను ప్రస్తావించిన ఉత్తమ్... ఆ మాటే పార్టీలో అందరినీ యాక్టివేట్ చేయనుందన్నారు.
ఈ దఫా ఎన్నికల్లో ఆరు నెలల ముందుగానే పార్టీ అభ్యర్థులను ప్రకటిస్తామని కూడా ఉత్తమ్ కుమార్ రెడ్డి చెప్పారు. ఈ సందర్భంగా రాహుల్ పర్యటనపై స్పందించిన సినీ నటుడు ప్రకాశ్ రాజ్‌ను ఆయన ఓ బఫూన్‌గా అభివర్ణించారు. ప్రకాశ్ రాజ్ అంత మొనగాడైతే మా ఎన్నికల్లో ఎందుకు ఓడిపోతారని కూడా ఆయన ప్రశ్నించారు. కేసీఆర్ మెప్పు కోసమే ప్రకాశ్ రాజ్ మాట్లాడుతున్నారన్న ఉత్తమ్... రాజ్యసభ సీటు ఇస్తారన్న ఆశతో ప్రకాశ్ రాజ్ నోటికొచ్చినట్లు మాట్లాడుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు.