రాజ్ థాకరేకి ఉద్ధవ్ థాకరే భయపడుతున్నట్టుంది: కాంగ్రెస్
- ఔరంగాబాద్ ర్యాలీలో రాజ్ థాకరే నిబంధనలను ఉల్లంఘించారు
- ఇప్పటికే ఆయనపై రెండు నాన్ బెయిలబుల్ వారెంట్లు ఉన్నాయి
- ఆయనను అరెస్ట్ చేయకుండా పోలీసులు మౌనంగా ఉన్నారు
మహారాష్ట్ర సీఎం ఉద్ధవ్ థాకరేను ఉద్దేశించి కాంగ్రెస్ నేత సంజయ్ నిరుపమ్ కీలక వ్యాఖ్యలు చేశారు. ఎంఎన్ఎస్ అధినేత రాజ్ థాకరేకి సీఎం ఉద్ధవ్ థాకరే భయపడుతున్నట్టుందని ఆయన అన్నారు. మే 1న రాజ్ థాకరే ఔరంగాబాద్ ర్యాలీకి పలు నిబంధనలతో ప్రభుత్వం అనుమతిని ఇచ్చిందని... అయితే ఆ నిబంధనలను రాజ్ థాకరే ఉల్లంఘించారని సంజయ్ నిరుపమ్ అన్నారు.
ఆయనను తక్షణమే అరెస్ట్ చేయాలని డిమాండ్ చేశారు. రెండు కోర్టుల నుంచి రాజ్ పై ఇప్పటికే నాన్ బెయిలబుల్ వారెంట్లు కూడా ఉన్నాయని.... అయినా ముంబై పోలీసులు మౌనంగా ఉన్నారని అన్నారు. రాజ్ థాకరేకు ఈ ప్రభుత్వం భయపడుతున్నట్టుందని వ్యాఖ్యానించారు. మరోవైపు, మహారాష్ట్రలోని సంకీర్ణ ప్రభుత్వంలో కాంగ్రెస్ కూడా భాగస్వామిగా ఉందన్న విషయం తెలిసిందే.