సోలో ఫైట్ అంటూ సోది కబుర్లు ఎందుకు సాయిరెడ్డి గారు?: బుద్ధా వెంకన్న
- పొత్తుల దిశగా చంద్రబాబు వ్యాఖ్యలపై వైసీపీ స్పందన
- విజయసాయిరెడ్డి స్పందనపై బుద్ధా వెంకన్నఘాటు రిప్లై
- నేరాల్లో టీడీపీ వాళ్లు ఉంటే ఉరేసేవారు కదా అంటూ వ్యాఖ్య
వచ్చే ఎన్నికల్లో పొత్తుల దిశగా టీడీపీ అధినేత నారా చంద్రబాబునాయుడు చేసిన వ్యాఖ్యలపై వైసీపీ నేతలు విరుచుకుపడుతున్న సంగతి తెలిసిందే. వచ్చే ఎన్నికల్లో వైసీపీది ఒంటరి పోరేనంటూ ఆ పార్టీ నేతలు వరుసబెట్టి ప్రకటిస్తున్నారు.
ఈ క్రమంలో శనివారం ఆ పార్టీ ప్రధాన కార్యదర్శి, రాజ్యసభ సభ్యుడు విజయసాయిరెడ్డి కూడా అదే మాటను చెప్పారు. ఈ ప్రకటనపై టీడీపీ కీలక నేత బుద్ధా వెంకన్న విరుచుకుపడ్డారు. సోలో ఫైట్ అంటూ సోది కబుర్లు ఎందుకు సాయిరెడ్డి గారు... అంటూ కాసేపటి క్రితం ట్విట్టర్ వేదికగా బుద్ధా వెంకన్న వరుస ట్వీట్లను సంధించారు.
కాంగ్రెస్ పార్టీ తో వైసీపీ పొత్తు పెట్టుకుంటుందని మీ అధినేత ప్రశాంత్ కిషోర్ ప్రకటించిన తరువాత కూడా ఇంకా సోలో ఫైట్ అంటూ సోది కబుర్లు ఎందుకు సాయిరెడ్డి గారు? అంటూ సెటైరికల్‌గా స్పందించిన బుద్ధా వెంకన్న.. జగన్ రెడ్డి సోలో ఫైట్ మాట దేవుడెరుగు.. కుటుంబ సభ్యులు, సొంత చెల్లి, తల్లి ఛీ కొట్టి సోలోగా మిగిలిపోయాడనేది వాస్తవమంటూ ఘాటు వ్యాఖ్యలు చేశారు.
జగన్‌కు ఇచ్చిన ఒక్క ఛాన్స్ లాస్ట్.. మళ్లీ ఓటేసేదేలే అని జనాలు తొడకొట్టి మరీ శపథం చేస్తున్నారన్న బుద్ధా... రేపులు, మర్డర్లు వైసీపీ నాయకుల జన్మహక్కు కాబట్టే చర్యలు లేవని ఆరోపించారు. నిజంగా టీడీపీ వాళ్లు ఉంటే నడి రోడ్డు మీద ఉరి తీసి హడావిడి చేసేవాళ్లు కదా? అంటూ సాయిరెడ్డిని దెప్పి పొడిచారు.
విశాఖను రాజధానిగా ప్రకటించిన తరువాత మీరు.., మీ బంధువుల భూకబ్జాలు తప్ప విశాఖలో ఒక్క ఇటుకైనా పెట్టారా? అని ప్రశ్నించారు. 'మీరు అడుగుపెట్టాక విశాఖపట్నం విషాదపట్నంగా మారిందని, కాబట్టే మిమ్మల్ని అక్కడి నుండి తరిమేసారు సాయి రెడ్డి' అంటూ వ్యాఖ్యానించారు.