ఓ కార్యకర్త ఇంట్లో... సాధారణ బాత్రూంలో స్నానం చేసిన యూపీ మంత్రి

  • వార్తల్లోకెక్కిన యూపీ మంత్రి
  • షాజహాన్ పూర్ జిల్లాలో పర్యటించిన నందగోపాల్ గుప్తా
  • చాక్ కన్హావు గ్రామంలో బస
  • తమ ప్రభుత్వంలో వీఐపీ కల్చర్ లేదన్న మంత్రి
ఉత్తరప్రదేశ్ పారిశ్రామికాభివృద్ధి శాఖ మంత్రి నందగోపాల్ గుప్తా వార్తల్లోకెక్కారు. ఆయన ఓ కార్యకర్త ఇంట్లో అత్యంత సాధారణ రీతిలో స్నానం చేయడమే అందుకు కారణం. నందగోపాల్ గుప్తా ఇటీవల షాజహాన్ పూర్ జిల్లాలో పర్యటించారు. చాక్ కన్హావు గ్రామాన్ని సందర్శించే సమయానికి ఆయన బాగా అలసిపోయారు. దాంతో అక్కడే ఓ కార్యకర్త ఇంట్లో విశ్రమించిన ఆయన, మరుసటి రోజు ఉదయం అక్కడ చేతిపంపు వద్ద స్నానం చేశారు. 

సాధారణ బాత్రూం అయినప్పటికీ ఆయన ఆడంబరాలకు పోకుండా స్నానం ముగించారు. దీనిపై ఆయన వివరణ ఇస్తూ, తమ ప్రభుత్వంలో వీఐపీ సంస్కృతి లేదని, నిరాడంబరతకే అత్యధిక ప్రాధాన్యత ఉంటుందని స్పష్టం చేశారు. దీనికి సంబంధించిన వీడియోను మంత్రి నందగోపాల్ గుప్తానే స్వయంగా పంచుకున్నారు.


More Telugu News