భూములు ఇచ్చే రైతులకు మనం ఎంత చేసినా తక్కువే: మంత్రి కేటీఆర్
- వరంగల్ జిల్లాలో కిటెక్స్ టెక్స్ టైల్స్ పరిశ్రమ
- శంకుస్థాపన చేసిన మంత్రి కేటీఆర్
- రైతుల కష్టనష్టాలు లెక్కచేయకుండా భూములిచ్చారని కితాబు
- రైతులకు 100 గజాల చొప్పున ప్లాట్లు ఇస్తామని హామీ
వరంగల్ రూరల్ జిల్లా గీసుకొండ మండలం హవేలీలోని కాకతీయ మెగా టెక్స్ టైల్ పార్కులో కిటెక్స్ టెక్స్ టైల్ పరిశ్రమకు భూమిపూజ జరిగింది. ఈ కార్యక్రమంలో పాల్గొన్న తెలంగాణ పరిశ్రమల శాఖ మంత్రి కేటీఆర్ మాట్లాడుతూ, తెలంగాణ రాష్ట్ర అభివృద్ధికి రైతులు వెన్నుదన్నుగా నిలుస్తున్నారని కొనియాడారు. కష్టమైనా, నష్టమైనా ఎదుర్కొని, ఈ ప్రాజెక్టుకు రైతులు భూములిచ్చారని, వారందరికీ పాదాభివందనం చేస్తున్నానని అన్నారు.
భూమి ఇవ్వడం చిన్న త్యాగమేమీ కాదని, భూములిచ్చే రైతులకు ఎంత చేసినా తక్కువేనని కేటీఆర్ పేర్కొన్నారు. భూములు ఇచ్చిన రైతులందరికీ 100 గజాల చొప్పున ప్లాట్లు ఇస్తామని హామీ ఇచ్చారు. భూమి లేక తమకు నష్టం జరిగినా, ఇంకెంతో మందికి లాభం చేకూరుతుందన్న ఉద్దేశంతో రైతులు చేసే త్యాగాలు వెలకట్టలేనివని కేటీఆర్ వ్యాఖ్యానించారు. ఎంత చేసినా వారి రుణం తీరనిదని పేర్కొన్నారు.