మోదీపై ప్రొఫెసర్ నాగేశ్వర్ 'జీడీపీ' సెటైర్!
- గ్యాస్ సిలిండర్‌పై మరో రూ.50 పెంపు
- జీడీపీ పెరుగుదలలో మోదీని మించిన వారు లేరన్న నాగేశ్వర్
- జీడీపీ అంటే గ్యాస్, డీజిల్, పెట్రోల్ అని సెటైర్
ఇప్పటికే దేశంలో పెట్రోల్, డీజిల్ ధరలు ఆకాశాన్నంటాయి. నిత్యం పెట్రోల్, డీజిల్ ధరలు పెరుగుతున్న నేపథ్యంలో తాజాగా శనివారం గ్యాస్ సిలిండర్ ధరలను మరోమారు పెంచుతూ కేంద్రంలోని నరేంద్ర మోదీ సర్కారు కీలక నిర్ణయం తీసుకుంది. గ్యాస్ సిలిండర్‌పైచ రూ.50 చొప్పున పెంచుతున్నట్లు ప్రకటించింది. తాజా పెంపుదలతో గ్యాస్ సిలిండర్ ధర వెయ్యిని దాటేసింది.
గ్యాస్ ధర పెంచుతూ మోదీ సర్కారు చేసిన ప్రకటనపై రాజకీయ విశ్లేషకుడు, మాజీ ఎమ్మెల్సీ ప్రొఫెసర్ నాగేశ్వర్ సెటైరికల్ కామెంట్లు చేశారు. జీడీపీలో ప్రధాని నరేంద్ర మోదీ ఏ ఒక్కరికీ సాధ్యం కాని రికార్డులను నమోదు చేశారన్న నాగేశ్వర్.. ఈ విషయంలో ఏ ఒక్కరు కూడా మోదీని ఓడించలేరని కూడా ఆయన వ్యంగ్యంగా అన్నారు. అయితే జీడీపీ అంటే గ్రాస్ డొమెస్టిక్ ప్రొడక్ట్ కాదన్న నాగేశ్వర్... గ్యాస్, డీజిల్, పెట్రోల్ అంటూ మోదీపై విమర్శలు గుప్పించారు.