వ‌చ్చే ఎన్నిక‌ల్లో ఒంట‌రిగా పోటీ చేసే దమ్ము లేదు.. అందుకే చంద్ర‌బాబు ఇలా చేస్తున్నారు: అంబ‌టి

  • పొత్తుల‌తో పోటీ చేయడానికి చంద్ర‌బాబు ఏర్పాట్లు చేసుకుంటున్నార‌న్న మంత్రి
  • అన్ని పార్టీలు క‌లిసి రావాల‌ని ఆయ‌న ఎందుకు అంటున్నార‌ని అంబ‌టి ప్ర‌శ్న
  • చంద్ర‌బాబు ప‌ర్య‌ట‌న‌పై ప్ర‌జ‌ల నుంచి స్పందన లేద‌ని విమ‌ర్శ‌
టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడిపై ఏపీ మంత్రి అంబటి రాంబాబు తీవ్ర విమ‌ర్శ‌లు గుప్పించారు. వ‌చ్చే ఎన్నిక‌ల్లో ఒంట‌రిగా పోటీ చేసే దమ్ము లేక ఇతర పార్టీల‌తో పొత్తుల‌తో పోటీ చేయడానికి చంద్ర‌బాబు ఏర్పాట్లు చేసుకుంటున్నార‌ని ఆయ‌న అన్నారు. అన్ని పార్టీలు క‌లిసి రావాల‌ని ఆయ‌న ఎందుకు అంటున్నార‌ని అంబ‌టి ప్ర‌శ్నించారు. ప‌న్నులు విధిస్తూ ప్ర‌జ‌లను ఇబ్బంది పెడుతున్నార‌ని చంద్ర‌బాబు అంటున్నార‌ని, పన్నులు లేకుండా ప్రభుత్వాలు నడుస్తాయా? అని ఆయ‌న ప్ర‌శ్నించారు. 

గతంలో అధికారంలో ఉన్న స‌మ‌యంలో చంద్రబాబు పన్నులు లేకుండానే ప్రభుత్వాన్ని నడిపారా? అని నిల‌దీశారు. ఏపీలో నవరత్నాలు, సంక్షేమ కార్యక్రమాలు అమలు కాకూడదని ఆయ‌న భావిస్తున్నార‌ని, ఆయ‌న‌కు ఎల్లో మీడియా మ‌ద్ద‌తుగా నిలుస్తోంద‌ని అంబ‌టి రాంబాబు ఆరోపించారు. చంద్ర‌బాబు నాయుడి ప‌ర్య‌ట‌న‌పై ప్ర‌జ‌ల నుంచి స్పందన లేకపోయినప్పటికీ జ‌నాలు త‌ర‌లివ‌స్తున్నారంటూ ఎల్లో మీడియా అస‌త్యాలు చెబుతోంద‌ని ఆయ‌న అన్నారు.


More Telugu News