కేఎల్ రాహుల్ తో పెళ్లి వార్తలపై స్పందించిన అతియాశెట్టి
- తాను ఎవరితోనూ వెళ్లడం లేదన్న అతియా
- కుటుంబంతో కలసి కొత్త ఇంట్లోనే ఉంటున్నానని వెల్లడి
- ఎవరికి నచ్చినట్టు వారు ఆలోచించుకోనీయండని కామెంట్
- వీటికి నవ్వడం మినహా తాను చేసేదేమీ లేదన్నఅతియా
బాలీవుడ్ నటి అతియా శెట్టి, తన బోయ్ ఫ్రెండ్, ప్రముఖ క్రికెటర్, లక్నో సూపర్ జెయింట్స్ కెప్టెన్ కేఎల్ రాహుల్ ను త్వరలోనే పెళ్లాడనుందంటూ వచ్చిన వార్తల పట్ల స్పందించింది. ‘‘నేను ఎవరితోనూ కలిసి తిరగడం లేదు. నా తల్లిదండ్రులు, నా కుటుంబంతో కలసి కొత్త ఇంట్లోనే ఉండబోతున్నాం’’ అంటూ చెప్పింది. దక్షిణ ముంబై ఆల్టమౌంట్ రోడ్డులో అతియాశెట్టి తన కుటుంబంతో ఉంటోంది.
కేఎల్ రాహుల్ ను పెళ్లి చేసుకోబోతున్న వార్తలను మీడియా ప్రతినిధులు ఆమె వద్ద ప్రస్తావించారు. ‘‘నేను ఈ ప్రశ్నలకు బదులివ్వను. వీటితో అలసిపోయాను. వీటిని విని నవ్వుకోవడమే చేయగలను. ప్రజలు వారికి నచ్చినట్టు ఆలోచించుకోనీయండి’’ అని అతియాశెట్టి బదులిచ్చింది. అతియాశెట్టి పెళ్లి వార్తలను ఆమె సోదరుడు అహాన్ సైతం ఇటీవల ఖండించాడు.
అటువంటి వేడుకే లేదని, వినిపించేవన్నీ వదంతులేనని అహాన్ తెలిపాడు. పెళ్లి లేనప్పుడు తాము సమాచారం ఎలా ఇచ్చేది? అంటూ ప్రశ్నించాడు. నిశ్చితార్థం కూడా జరగని విషయాన్ని గుర్తు చేశాడు. అతియా, కేఎల్ రాహుల్ ఇద్దరూ సన్నిహితంగా ఉంటున్నట్టు ఎప్పటి నుంచో వార్తలు వినిపిస్తుండడం తెలిసిందే.