డేనియల్ శామ్స్ సూపర్ స్పెల్.. ఉత్కంఠ పోరులో ముంబైని వరించిన విజయం
- చివరి ఓవర్ వరకు గెలుపు బాటలోనే పయనించిన గుజరాత్
- చివరి ఓవర్‌లో 9 పరుగులు సాధించలేకపోయిన టైటాన్స్
- ఆఖరి ఓవర్‌లో మూడు పరుగులు మాత్రమే ఇచ్చిన శామ్స్
- ‘ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్’గా టిమ్ డేవిడ్
వరుస పరాజయాలతో కునారిల్లిన ముంబై ఇండియన్స్ ఖాతాలో మరో విజయం చేరింది. గుజరాత్ టైటాన్స్‌తో గత రాత్రి జరిగిన ఉత్కంఠ పోరులో ఐదు పరుగుల తేడాతో విజయం సాధించి వరుసగా రెండో విజయాన్ని నమోదు చేసింది.
తొలుత బ్యాటింగులో రాణించిన ముంబై ఆ తర్వాత బంతితోనూ అద్భుతం చేసింది. చివరి ఓవర్లో టైటాన్స్ విజయానికి 9 పరుగులు అవసరం కాగా, ముంబైకి మరో ఓటమి తప్పదని అందరూ భావించారు. అయితే, చివరి ఓవర్ వేసిన డేనియల్ శామ్స్ నిప్పులు చెరిగే బంతులు సంధించి మూడు పరుగులు మాత్రమే ఇచ్చి గుజరాత్ నుంచి విజయాన్ని లాగేసుకున్నాడు.
క్రీజులో డేవిడ్ మిల్లర్, రాహుల్ తెవాటియా ఉన్నప్పటికీ శామ్స్ బంతులను ఎదుర్కొని 9 పరుగులు సాధించలేకపోవడం గమనార్హం. ఇప్పటికే ప్లే ఆఫ్స్ రేసు నుంచి తప్పుకున్న ముంబైకి ఇది వరుసగా రెండో విజయం కావడం గమనార్హం.
ముంబై నిర్దేశించిన 173 పరుగుల విజయ లక్ష్యంతో బ్యాటింగ్ ప్రారంభించిన టైటాన్స్ చివరి ఓవర్ వరకు గెలుపు బాటలోనే పయనించినా ఆఖరి ఓవర్ కలిసిరాలేదు. సాహా 55, శుభమన్ గిల్ 52 పరుగులు చేయగా, కెప్టెన్ పాండ్యా 24, సాయి సుదర్శన్ 14, డేవిడ్ మిల్లర్ 19 (నాటౌట్) పరుగులు చేశారు. ఫలితంగా నిర్ణీత 20 ఓవర్లలో 5 వికెట్లు మాత్రమే కోల్పోయి 172 పరుగులు చేసి విజయం ముంగిట బోల్తాపడింది. మురుగన్ అశ్విన్‌కు రెండు వికెట్లు లభించాయి.
అంతకుముందు టాస్ ఓడి తొలుత బ్యాటింగ్ చేసిన ముంబై 6 వికెట్ల నష్టానికి 177 పరుగులు చేసింది. ఇషాన్ కిషన్ (45), రోహిత్ శర్మ (43) చక్కని ఓపెనింగ్ భాగస్వామ్యం అందించారు. సూర్యకుమార్ యాదవ్ (13), తిలక్ వర్మ (21), పొలార్డ్ (4) స్వల్ప స్కోర్లకే అవుటైనా, చివర్లో టిమ్ డేవిడ్ చెలరేగడంతో భారీ స్కోరు సాధ్యమైంది. 21 బంతులు ఆడిన డేవిడ్ 2 ఫోర్లు, 4 సిక్సర్లతో 44 పరుగులు చేశాడు.
టైటాన్స్ బౌలర్లలో రషీద్ ఖాన్‌కు రెండు వికెట్లు దక్కాయి. మెరుపు ఇన్నింగ్స్ ఆడిన డేవిడ్‌కు ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డు లభించింది. ఐపీఎల్‌లో నేడు రెండు మ్యాచ్‌లు జరగనున్నాయి. పంజాబ్ కింగ్స్‌తో రాజస్థాన్ రాయల్స్, లక్నో సూపర్ జెయింట్స్‌తో కోల్‌కతా నైట్ రైడర్స్ తలపడతాయి.