210 కంపెనీల్లో 26,289 ఉద్యోగాలు.. రేపే ఏఎన్‌యూలో వైసీపీ జాబ్ మేళా.. వివరాలు తెలిపిన విజయసాయిరెడ్డి
- 97,000 మంది దరఖాస్తు
- ఏర్పాట్లను పరిశీలించిన విజయసాయిరెడ్డి
- జాబ్ మేళా నిరంతర ప్రక్రియ అని వెల్లడి
ఏపీలో అధికార పార్టీ వైసీపీ నిర్వహిస్తున్న జాబ్ మేళాల్లో భాగంగా శనివారం గుంటూరు జిల్లా పరిధిలోని ఆచార్య నాగార్జున విశ్వవిద్యాలయంలో మూడో జాబ్ మేళాను నిర్వహిస్తున్నట్లు వైసీపీ ప్రధాన కార్యదర్శి, రాజ్యసభ సభ్యుడు వేణుంబాక విజయసాయిరెడ్డి ప్రకటించారు. యూనివర్సిటీలో జాబ్ మేళా ఏర్పాట్లను శుక్రవారం ఆయన పరిశీలించారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఈ జాబ్ మేళాకు 210 కంపెనీలు హాజరు కానున్నాయని చెప్పారు. 210 కంపెనీల్లో 26,289 ఉద్యోగాలు ఖాళీగా ఉన్నాయని ఆయన పేర్కొన్నారు. ఈ జాబ్ మేళాకు హాజరయ్యేందుకు కోస్తాంధ్ర జిల్లాలకు చెందిన 97,000 మంది నిరుద్యోగులు దరఖాస్తు చేసుకున్నారని ఆయన వెల్లడించారు. జాబ్ మేళాను నిరంతర ప్రక్రియగా ఆయన తెలిపారు.