సభలో ఏం మాట్లాడాలంటూ రాహుల్ ప్రశ్న!... ట్రోలింగ్ మొదలెట్టేసిన టీఆర్ఎస్!
- వరంగల్ చేరుకున్న రాహుల్
- రేవంత్, భట్టి ఇతర నేతలతో భేటీ
- సభ గురించిన వివరాలపై ఆరా
- రాహుల్ వ్యాఖ్యల వీడియోలు బహిర్గతం
కాంగ్రెస్ పార్టీ మాజీ అధ్యక్షుడు రాహుల్ గాంధీ తెలంగాణ పర్యటన శుక్రవారం సాయంత్రం ప్రారంభమైన సంగతి తెలిసిందే. ఇప్పటికే హైదరాబాద్ నుంచి వరంగల్ చేరుకున్న రాహుల్ గాంధీ... వరంగల్ ఆర్ట్స్ కాలేజీ మైదానంలో టీపీసీసీ ఏర్పాటు చేసిన రైతు సంఘర్షణ సభలో పాల్గొననున్నారు. ఈ సందర్భంగా రాహుల్ గాంధీకి సంబంధించిన ఓ వీడియోను పట్టేసిన టీఆర్ఎస్ నేతలు సోషల్ మీడియా వేదికగా కాంగ్రెస్ నేతపై ట్రోలింగ్ మొదలుపెట్టేశారు.
వరంగల్ చేరుకున్న సందర్భంగా టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి, సీఎల్పీ నేత మల్లు భట్టి విక్రమార్క తదితరులతో భేటీ అయ్యారు. వరంగల్ సభకు ముందు జరిగిన ఈ భేటీలో భాగంగా రాహుల్ పలు వ్యాఖ్యలు చేశారు. నేటి సభ థీమ్ ఏమిటి? సభలో తాను ఏ అంశంపై మాట్లాడాలి? అంటూ ఆయన టీకాంగ్రెస్ నేతలను ప్రశ్నించారు. ఈ దిశగా రాహుల్ చేసిన వ్యాఖ్యల వీడియోతో పాటు ఆడియో ఫుటేజీలు బయటకొచ్చేశాయి. ఈ పుటేజీలను సోషల్ మీడియాలో పోస్ట్ చేస్తున్న టీఆర్ఎస్ నేతలు రాహుల్‌పైనా, కాంగ్రెస్ పార్టీ నేతలపైనా ట్రోలింగ్ మొదలెట్టేశారు.