వీళ్లంతా కట్టకట్టుకుని వచ్చినా మమ్మల్నేమీ చేయలేరు: చంద్రబాబు పొత్తు వ్యాఖ్యలపై మంత్రి కాకాణి
- మామ నుంచి పార్టీ లాక్కున్న వ్యక్తికి నైతికత ఏముంటుందన్న కాకాణి
- ఎప్పుడు ఎన్నికలొచ్చినా పొత్తులతోనే బాబు పోటీ అంటూ ఎద్దేవా
- ఏ ఎన్నికల్లోనూ సొంతంగా పోటీ చేసే ధైర్యం చంద్రబాబుకు లేదన్న కాకాణి
2024 ఎన్నికల్లో వైసీపీ ప్రభుత్వాన్ని గద్దె దించడమే లక్ష్యంగా అన్ని పార్టీలు కలిసి ప్రజా ఉద్యమం చేయాలంటూ కీలక వ్యాఖ్యలు చేసిన టీడీపీ అధినేత నారా చంద్రబాబునాయుడుపై వైసీపీ కీలక నేత, ఏపీ వ్యవసాయ శాఖ మంత్రి కాకాణి గోవర్ధన్ రెడ్డి ఘాటు విమర్శలు గుప్పించారు. ఏ ఎన్నికల్లోనూ సొంతంగా పోటీ చేసే ధైర్యం చంద్రబాబుకు లేదంటూ కాకాణి ధ్వజమెత్తారు.
చంద్రబాబు చరిత్ర ఎవరికి తెలియదని ప్రశ్నించిన కాకాణి... గతంలో బీజేపీతో పొత్తు పెట్టుకున్నారని చెప్పారు. దత్తపుత్రుడిని పక్కన పెట్టుకున్న చంద్రబాబు గతంలో తిట్టిన బీజేపీతోనే మళ్లీ పొత్తుకు ఆరాటపడుతున్నారని విమర్శించారు. మామ నుంచి పార్టీ లాక్కున్న వ్యక్తికి నైతికత ఏముంటుందని కాకాణి తీవ్ర విమర్శ చేశారు. ఎప్పుడు ఎన్నికలొచ్చినా పొత్తులతోనే బాబు పోటీ చేస్తారన్న కాకాణి... చంద్రబాబుకు నైతికత, సిద్ధాంతం లేవని విమర్శించారు. ఎవరితోనైనా పొత్తుకు ప్రయత్నాలు చేస్తారని, వీళ్లంతా కట్టకట్టుకుని వచ్చినా తమను ఏమీ చేయలేరని కాకాణి వ్యాఖ్యానించారు.