జ‌గ‌న్‌తో నీతి ఆయోగ్ బృందం భేటీ

  • యూఎన్‌డీపీ కింద చేప‌ట్ట‌నున్న ప‌నుల‌పై స‌మీక్ష‌
  • సుస్ధిర ఆర్ధిక ప్రగతి లక్ష్యాల సాధనపై కీల‌క‌ చ‌ర్చ
  • దీనిపై మానిటరింగ్‌ సెల్ ను ఏర్పాటు చేయ‌నున్న‌ రాష్ట్ర ప్ర‌భుత్వం
ఏపీ సీఎం వైఎస్ జ‌గ‌న్ మోహ‌న్ రెడ్డితో శుక్ర‌వారం నీతి ఆయోగ్ బృందం భేటీ అయ్యింది. తాడేప‌ల్లిలోని సీఎం క్యాంపు కార్యాల‌యంలో జ‌రిగిన ఈ భేటీలో ఐక్య‌రాజ్య స‌మితి అభివృద్ధి ప‌థ‌కం (యూఎన్‌డీపీ) భాగ‌స్వామ్యంతో ప్రణాళికా విభాగంలో సుస్ధిర ఆర్ధిక ప్రగతి కోసం నిర్దేశించుకున్న లక్ష్యాల సాధనపై చ‌ర్చ జ‌రిగింది. ఈ అంశంపై ప‌ర్య‌వేక్ష‌ణ కోసం మానిటరింగ్‌ సెల్ ను రాష్ట్ర ప్ర‌భుత్వం ఏర్పాటు చేయ‌నుంది. దీనిపైనే ఈ భేటీలో ప్ర‌ధానంగా చ‌ర్చ జ‌రిగింది. 

ఈ సమావేశంలో పాల్గొన్న నీతి ఆయోగ్‌ సలహాదారు (ఎస్డీజీ) సాన్యుక్త సమద్దార్‌, రాష్ట్ర ప్ర‌భుత్వ ప్ర‌ధాన కార్య‌ద‌ర్శి సమీర్‌ శర్మ, ప్రణాళికా శాఖ కార్యదర్శి జీఎస్‌ఆర్‌కే విజయ్‌కుమార్, యూఎన్‌డీపీ (ఇండియా) ముఖ్య సలహాదారు మీనాక్షి కతెల్, యూఎన్‌డీపీ డిప్యూటీ రెసిడెంట్‌ రెప్రజెంటెటివ్‌ డెన్నిస్‌ కర్రీ త‌దిత‌రులు పాల్గొన్నారు.


More Telugu News