భారీ నష్టాల్లో ముగిసిన మార్కెట్లు

  • అంతర్జాతీయంగా ప్రతికూల సంకేతాలు
  • 866 పాయింట్లు నష్టపోయిన సెన్సెక్స్
  • 271 పాయింట్లు కోల్పోయిన నిఫ్టీ
దేశీయ స్టాక్ మార్కెట్లు ఈరోజు భారీ నష్టాల్లో ముగిశాయి. ఈ ఉదయం నష్టాల్లో ప్రారంభమైన మార్కెట్లు చివరి వరకు అదే ట్రెండ్ ను కొనసాగించాయి. అంతర్జాతీయంగా ప్రతికూల సంకేతాలు ఉన్న నేపథ్యంలో ఇన్వెస్టర్లు అమ్మకాలకే మొగ్గు చూపారు. ఏ దశలో కూడా మదుపరులు కొనుగోళ్లకు మొగ్గు చూపలేదు. ఈ నేపథ్యంలో, ఈరోజు ట్రేడింగ్ ముగిసే సమయానికి సెన్సెక్స్ 866 పాయింట్లు నష్టపోయి 54,835కి పడిపోయింది. నిఫ్టీ 271 పాయింట్లు పతనమై 16,411 వద్ద స్థిరపడింది. 

బీఎస్ఈ సెన్సెక్స్ టాప్ గెయినర్స్:
టెక్ మహీంద్రా (2.21%), పవర్ గ్రిడ్ కార్పొరేషన్ (1.88%), ఐటీసీ (1.83%), స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (0.92%), ఎన్టీపీసీ (0.60%). 

టాప్ లూజర్స్:
బజాజ్ ఫైనాన్స్ (-4.91%), యాక్సిస్ బ్యాంక్ (-4.11%), బజాజ్ ఫిన్ సర్వ్ (-3.49%), నెస్లే ఇండియా (-3.34%), విప్రో (-3.12%).


More Telugu News