బీజేపీ పాలనలో దేశ ఆర్థిక వ్యవస్థ నాశనమయింది: కేటీఆర్

  • నిరుద్యోగ రేటు విపరీతంగా పెరిగిందన్న కేటీఆర్ 
  • ద్రవ్యోల్బణం 30 ఏళ్ల గరిష్ఠానికి చేరుకుందని వెల్లడి 
  • రాహుల్ కి స్వాగతం పలుకుతున్నామన్న కేటీఆర్ 
బీజేపీ, కాంగ్రెస్ లపై తెలంగాణ మంత్రి కేటీఆర్ మండిపడ్డారు. ఎన్పీయే ప్రభుత్వంలో భారతదేశ ఆర్థిక వ్యవస్థ నాశనమయిందని అన్నారు. ద్రవ్యోల్బణం 30 ఏళ్ల గరిష్ఠానికి చేరుకుందని విమర్శించారు. ఎల్పీజీ సిలిండర్ ధర ప్రపంచంలోనే అత్యంత ఎక్కువగా ఉందని అన్నారు. బీజేపీ అధికారంలోకి వచ్చిన తర్వాత నిరుద్యోగ రేటు గత 45 ఏళ్లలో ఎన్నడూ లేనంతగా పెరిగిందని విమర్శించారు.  

ఇలాంటి వాళ్లు తెలంగాణకు వచ్చి నీతులు చెప్పడం హాస్యాస్పదంగా ఉందని అన్నారు. తెలంగాణకు విచ్చేస్తున్న రాహుల్ గాంధీకి స్వాగతం పలుకుతున్నామని చెప్పిన కేటీఆర్... తెలంగాణ కోసం టీఆర్ఎస్ ప్రభుత్వం అమలు చేస్తున్న పథకాలను అధ్యయనం చేయాలని ఆయనకు సూచించారు. తమ పథకాలను కాంగ్రెస్ పాలిత ప్రాంతాల్లో అమలు చేయాలని అన్నారు.


More Telugu News