అవంతి గారి రాసలీలల ఆడియో తప్ప విశాఖ అభివృద్ధికి రూ.1 అయినా ప్రభుత్వం విడుదల చేసిందా?: అయ్యన్న పాత్రుడు
- పదవి పోయాక పరువు కాపాడుకోవడానికి ఉత్తరాంధ్ర గుర్తొచ్చిందా? అని అయ్యన్న నిలదీత
- మంత్రిగా ఉన్నప్పుడు ఉత్తరాంధ్ర అభివృద్ధి కోసం పాటుపడలేదని విమర్శ
- జగన్ రెడ్డి గారిని నిలదీసే ధైర్యం లేదని ఎద్దేవా
టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడికి అమరావతి మీదే ప్రేమ ఉందని, విశాఖకు పరిపాలన రాజధాని వద్దని ఆయన అంటే ఉత్తరాంధ్ర టీడీపీ నేతలు ఈ విషయంపై ఎందుకు మాట్లాడడం లేదని ఏపీ మాజీ మంత్రి అవంతి శ్రీనివాస్ విమర్శలు గుప్పించిన విషయం తెలిసిందే. దీనిపై టీడీపీ ఉత్తరాంధ్ర నేత అయ్యన్న పాత్రుడు స్పందిస్తూ కౌంటర్ ఇచ్చారు.
''విశాఖని రాజధానిగా ప్రకటించిన తరువాత అవంతి గారి రాసలీలల ఆడియో విడుదల తప్ప విశాఖ అభివృద్ధికి అదనంగా ఒక్క రూపాయి అయినా వైసీపీ ప్రభుత్వం విడుదల చేసిందా? పదవి పోయాక పరువు కాపాడుకోవడానికి ఉత్తరాంధ్ర గుర్తొచ్చిందా? మంత్రిగా ఉన్నప్పుడు ఉత్తరాంధ్ర అభివృద్ధి కోసం ఒక్క రూపాయి కూడా ఎందుకు కేటాయించడం లేదని జగన్ రెడ్డి గారిని నిలదీసే ధైర్యం లేని మీకు ఇప్పుడు ఉత్తరాంధ్ర ప్రజలు గుర్తొచ్చారా? అవంతి గారు?'' అని అయ్యన్న పాత్రుడు నిలదీశారు.