కల్వకుంట్ల కవితకు రేవంత్ రెడ్డి కౌంటర్
- రాహుల్ గాంధీని ప్రశ్నించే ముందు ఈ ప్రశ్నలకు సమాధానం చెప్పండంటూ ట్వీట్
- మోదీ రైతు వ్యతిరేక చట్టాలు తెచ్చినప్పుడు మీరెక్కడున్నారు? అని ప్రశ్న
- మోదీ ముందు కేసీఆర్ మోకరిల్లినప్పుడు ఎక్కడున్నారని నిలదీత
కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ తెలంగాణ పర్యటనకు వస్తున్న నేపథ్యంలో ఆయనపై టీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత చేసిన విమర్శలకు టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి కౌంటర్ ఇచ్చారు.
''శ్రీమతి కవితగారూ... రాహుల్ గాంధీని ప్రశ్నించే ముందు ఈ ప్రశ్నలకు సమాధానం చెప్పండి. మోదీ రైతు వ్యతిరేక చట్టాలు తెచ్చినప్పుడు మీరెక్కడున్నారు? మీ తండ్రి కేసీఆర్.. మోదీ ముందు మోకరిల్లి తెలంగాణ నుంచి బాయిల్డ్ రైస్ ఇవ్వబోమని లేఖ ఇచ్చి రైతులకు ఉరితాళ్లు బిగించినప్పుడు మీరెక్కడున్నారు?
వరి వేస్తే ఉరి అని మీ తండ్రి ప్రవచనాలు చెప్పి ఫాంహౌస్ లో 150 ఎకరాల్లో వరి వేసినప్పుడు మీరు ఎక్కడ ఉన్నారు? ఉమ్మడి వరంగల్, ఖమ్మం, నల్గొండ జిల్లాల్లో మిర్చి రైతులు పిట్టల్లా రాలిపోతుంటే మీరు ఎక్కడ ఉన్నారు?'' అని రేవంత్ రెడ్డి ప్రశ్నించారు.