సింగిల్ తీసి నీకు అవకాశం ఇవ్వనా? సెంచరీ చేస్తావా..?: వార్నర్ ను అడిగిన పావెల్

  • నీవు వీలైనంత మేర బ్యాటుతో బాదు
  • నేను కూడా అదే చేశా
  • పావెల్ కు బదులిచ్చిన వార్నర్
  • సన్ రైజర్స్ తో మ్యాచ్ సందర్భంగా ఆసక్తికర సన్నివేశం
సన్ రైజర్స్ హైదరాబాద్ పై ఢిల్లీ క్యాపిటల్స్ జట్టు సీనియర్ ఆటగాడు డేవిడ్ వార్నర్ కసి తీర్చుకున్నాడు. తనను కెప్టెన్ గా పీకేయడమే కాకుండా, అవమానకరంగా బయటకు పంపిన సన్ రైజర్స్ జట్టు బౌలర్లను ఉతికి పారేశాడు. గురువారం నాటి మ్యాచ్ లో 92 పరుగులు సాధించి నాటౌట్ గా నిలిచాడు. ఢిల్లీ క్యాపిటల్స్ విజయానికి మద్దతుగా నిలిచాడు.  

ఢిల్లీ క్యాపిటల్స్ జట్టు విజయానికి డేవిడ్ వార్నర్ (92), రావ్ మన్ పావెల్ (67) వారధులుగా నిలిచారు. మూడు వికెట్లు కోల్పోయిన ఢిల్లీని.. మరో వికెట్ నష్టపోకుండా వీరిద్దరు ఫెవికాల్ మాదిరిగా క్రీజులో నిలిచి స్కోరును 207 పరుగులకు చేర్చారు. అయితే చివరి ఓవర్ సందర్భంగా సెంచరీ చేసే అవకాశాన్ని వార్నర్ కు ఇస్తే బావుంటుందని పావెల్ భావించాడు. అప్పటికి వార్నర్ 90 పరుగులు దాటేశాడు.

‘‘20వ ఓవర్ ఆరంభంలో ఒక సింగిల్ తీసి స్ట్రయిక్ నీకు ఇస్తే సెంచరీ సాధిస్తావా? అంటూ వార్నర్ అడిగాను. దానికి అతడు క్రికెట్ ను ఆడే తీరు అది కాదు. నీవు వీలైనంత మేరకు బ్యాటింగ్ చేయి. నేను కూడా అదే చేశానని చెప్పాడు’’ అంటూ మ్యాచ్ సందర్భంగా చోటు చేసుకున్న సంభాషణను పావెల్ మీడియాతో పంచుకున్నాడు. అంతేకాదు ఐదో స్థానంలో తనను పంపించాలంటూ కెప్టెన్ రిషబ్ పంత్ ను కోరి మరీ క్రీజులోకి వచ్చాడు. బ్యాట్ తో నిరూపించుకున్నాడు.


More Telugu News