రాహుల్‌పై ఎమ్మెల్సీ క‌ల్వ‌కుంట్ల క‌విత ప్ర‌శ్నల వ‌ర్షం

రాహుల్‌పై ఎమ్మెల్సీ క‌ల్వ‌కుంట్ల క‌విత ప్ర‌శ్నల వ‌ర్షం
  • నేడు రాహుల్ ప‌ర్య‌ట‌న నేప‌థ్యంలో క‌విత స్పంద‌న‌
  • ఎన్నిసార్లు పార్లమెంట్‌లో తెలంగాణ అంశాలను ప్ర‌స్తావించారని ప్ర‌శ్న‌
  • టీఆర్ఎస్ పార్టీ పోరాడుతుంటే రాహుల్ ఎక్కడ ఉన్నారని నిల‌దీత‌
కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ తెలంగాణ ప‌ర్య‌ట‌న‌కు వ‌స్తున్న నేప‌థ్యంలో ఆయ‌న‌పై టీఆర్ఎస్ ఎమ్మెల్సీ క‌ల్వ‌కుంట్ల‌ క‌విత తీవ్ర విమ‌ర్శ‌లు గుప్పించారు. రాహుల్‌ కానీ, ఆయ‌న‌ పార్టీ కానీ ఎన్నిసార్లు పార్లమెంట్‌లో తెలంగాణ అంశాలు, హక్కులను ప్రస్తావించారో చెప్పాల‌ని ఆమె డిమాండ్ చేశారు. 

రాష్ట్ర హక్కుల కోసం టీఆర్ఎస్ పార్టీ పోరాడుతుంటే రాహుల్ ఎక్కడ ఉన్నారని ఆమె నిల‌దీశారు. దేశంలో ఒకే వరి కొనుగోలు విధానంపై త‌మ‌ పార్టీ పోరాటం చేస్తున్నప్పుడు, తెలంగాణ ప్రాజెక్టులకు రావాల్సిన జాతీయ హోదాతో పాటు రాష్ట్రానికి హక్కుగా రావాల్సిన పెండింగ్ జీఎస్టీ బకాయిల గురించి పోరాటం చేస్తున్నప్పుడు ఎక్కడ ఉన్నారని ఆమె ప్ర‌శ్నించారు.   

               


More Telugu News