పందిగుండె మార్పిడి తర్వాత మరణించిన వ్యక్తిలో జంతు సంబంధిత వైరస్ గుర్తింపు

  • మేరీల్యాండ్ వ్యక్తికి పందిగుండె అమర్చిన వైద్యులు
  • రెండు నెలల తర్వాత ఈ మార్చిలో కన్నుమూత
  • ఆయన మృతికి తాజాగా గుర్తించిన వైరస్ కారణం అవునో? కాదో? చెప్పలేకపోతున్న వైద్యులు
  • అది ఓ ‘హిచ్‌హైకర్’ అని అభిప్రాయపడుతున్న సర్జన్
పంది గుండె అమర్చుకున్న తర్వాత మరణించిన వ్యక్తిలో వైద్యులు తాజాగా యానిమల్ వైరస్ (జంతువైరస్)ను గుర్తించారు. అయితే, ఆయన మరణానికి అదే కారణమా? కాదా? అన్న విషయాన్ని ఇంకా నిర్ధారించలేదు. అమెరికాలోని మేరీల్యాండ్‌కు చెందిన 57 ఏళ్ల డేవిడ్ బెన్నెట్ సీనియర్‌కు వైద్యులు విజయవంతంగా పందిగుండెను అమర్చారు. అయితే, ఆ తర్వాత రెండు నెలలకే అంటే మార్చిలో ఆయన మృతి చెందారు.

 ఆయన శరీరంలో యానిమల్ వైరస్‌ను గుర్తించినట్టు తాజాగా మేరీల్యాండ్ యూనివర్సిటీ వైద్యులు తెలిపారు. పందిగుండె లోపల వైరల్ డీఎన్ఏను గుర్తించినట్టు చెప్పారు. పోర్సిన్ సైటోమెగలోవైరస్ అని పిలిచే ఈ బగ్ యాక్టివ్ ఇన్ఫెక్షన్‌కు కారణమవుతుందన్న సంకేతాలను కనుగొనలేదు. 

అయితే, జంతువుల నుంచి మనిషికి అవయవ మార్పిడికి సంబంధించి ఇప్పుడు వైద్యులను ఇది ఆందోళనకు గురిచేస్తోంది. జంతువుల అవయవాల మార్పిడి వల్ల కొత్త రకాల ఇన్ఫెక్షన్లు పుట్టుకొచ్చే ప్రమాదం ఉందని భావిస్తున్నారు. కొన్ని వైరస్‌లు గుప్తంగా ఉంటాయని, అవి వ్యాధిని కలిగించకుండా దాగి ఉంటాయని బెన్నెట్‌కు పందిగుండె అమర్చిన సర్జన్ డాక్టర్ బార్ట్‌లీ గ్రిఫిత్ పేర్కొన్నారు. బహుశా అది ఒక ‘హిచ్‌హైకర్’ (వాహకం) అయి ఉండొచ్చని ఆయన అభిప్రాయపడ్డారు.


More Telugu News