మరికాసేపట్లో ఏపీలో ఇంటర్ పరీక్షలు ప్రారంభం.. నిమిషం ఆలస్యమైనా నో ఎంట్రీ
- రాష్ట్రవ్యాప్తంగా పరీక్ష రాయనున్న 10 లక్షల మంది
- 1,456 పరీక్ష కేంద్రాల ఏర్పాట్లు
- సీసీ కెెమెరాల పర్యవేక్షణలో పరీక్షలు
- జిల్లాకు ఐదేసి చొప్పున ఫ్లయింగ్, సిట్టింగ్ స్క్వాడ్‌లు
ఆంధ్రప్రదేశ్‌లో మరికాసేపట్లో ఇంటర్మీడియెట్ పరీక్షలు ప్రారంభం కానున్నాయి. రాష్ట్రవ్యాప్తంగా మొత్తం 10,01,058 మంది విద్యార్థులు పరీక్షకు హాజరు కానున్నారు. వీరిలో ఫస్టియర్, సెకండియర్ విద్యార్థులు దాదాపు సమానంగా ఉన్నారు. ఇందుకోసం 1,456 పరీక్ష కేంద్రాలను ఏర్పాటు చేశారు. ఉదయం 9 గంటలకు పరీక్ష ప్రారంభమై 12 గంటలకు ముగుస్తుంది.
ఈ నేపథ్యంలో విద్యాశాఖ అధికారులు కీలక ప్రకటన చేశారు. నిమిషం ఆలస్యంగా వచ్చినా విద్యార్థులను పరీక్షకు అనుమతించబోమని హెచ్చరించారు. అలాగే, పరీక్ష కేంద్రాల్లోకి మొబైల్ ఫోన్లు అనుమతించరు. జిల్లాకు ఐదు చొప్పున ఫ్లయింగ్ స్క్వాడ్‌లు, సిట్టింగ్ స్క్వాడ్‌లను ఏర్పాటు చేశారు. అలాగే, అన్ని పరీక్ష కేంద్రాల్లోనూ సీసీ కెమెరాలు ఏర్పాటు చేశారు.