గ్రహాంతరవాసులను ఆకర్షించేందుకట.. స్త్రీపురుషుల నగ్న చిత్రాలను పంపేందుకు నాసా ప్లాన్!

  • ఏలియన్స్ కోసం 1974లో తొలిసారి రేడియో సందేశం
  • ఏళ్ల తరబడి ఎదురుచూస్తున్నా ఏలియన్స్ నుంచి రాని సమాధానం
  • ఇప్పుడు మరో ప్రయత్నానికి సిద్ధమైన నాసా
  • ఈసారి సఫలమవుతుందని విశ్వాసం
గ్రహాంతరవాసులు (ఏలియన్స్) ఉన్నారా? సగటు మానవుడికే కాదు, శాస్త్రవేత్తలకు కూడా అంతుచిక్కని ప్రశ్న ఇది. ఇప్పటి వరకు ఏలియన్స్‌ను ఎవరూ ప్రత్యక్షంగా చూడకపోయినా వారి గురించి చర్చలు మాత్రం ఆగడం లేదు. దాదాపు 150 ఏళ్లుగా గ్రహాంతరవాసుల గురించి చెప్పుకుంటూనే ఉన్నారు. 

ఒకవేళ కథల్లోనూ, సినిమాల్లోనూ కథా వస్తువుగా మారిన ఏలియన్స్ నిజంగానే ఉంటే వారిని ఆకర్షించడం ఎలా? ఈ ప్రశ్నకు అమెరికా అంతరిక్ష పరిశోధన సంస్థ నాసా ఓ సమాధానం కనిపెట్టింది. ఇందుకోసం ఓ ప్లాన్‌ను సిద్ధం చేసింది. దానిని అమలు చేసేందుకు కసరత్తులు ప్రారంభించింది.

ఇంతకీ, ఆ ప్లాన్ ఏంటో తెలుసా? స్త్రీపురుషుల నగ్న చిత్రాలను రోదసీలోకి పంపడం! అవును, ఈ ప్రయోగం ఫలితాలు ఇస్తుందని శాస్త్రవేత్తలు నమ్ముతున్నారు.  ఈ మేరకు ‘బెకాన్ ఇన్ ది గెలాక్సీ’ (బీఐటీజీ) అధ్యయనం పేర్కొంది. నాసా కనుక ఏలియన్స్ కోసం మానవుల నగ్నచిత్రాలను పంపితే ఇది వారి కోసం పంపిన రెండో మెసేజ్ అవుతుంది. 

1974లో మానవులకు సంబంధించిన సమాచారంతో ‘ఎరెకిబో’ సందేశాన్ని గ్లోబులర్ స్టార్ క్లస్టర్ ఎం13కి పంపారు. మానవులకు, భూమికి సంబంధించిన ప్రాథమిక సమాచారం కలిగిన ఇది ఇంటర్‌స్టెల్లార్ రేడియో సందేశం. అయితే, నాటి నుంచి ఎదరుచూస్తున్నా, ఆ సందేశానికి తిరుగు సందేశం ఇప్పటి వరకు రాలేదు. ఇప్పుడు మరో ప్రయత్నంగా స్త్రీపురుషుల నగ్న చిత్రాలను పంపించాలని నాసా నిర్ణయం తీసుకుంది. మరి ఈ ప్రయత్నమైనా సఫలమవుతుందేమో చూడాలి!


More Telugu News