ఏపీలో విద్యుత్ కోత‌ల‌కు మంత్రి ధ‌ర్మాన చెప్పిన కార‌ణం ఇదే!

  • వినియోగం విప‌రీతంగా పెర‌గ‌డ‌మే కోత‌ల‌కు కార‌ణమన్న ధర్మాన 
  • గ‌తంలో ఒక లైట్ వాడిన వారు ఇప్పుడు 10 లైట్లు వాడుతున్నారని వెల్లడి 
  • ఒక ఫ్యాన్ ఉన్న చోట ఇప్పుడు 4 ఫ్యాన్లు వ‌చ్చాయని వ్యాఖ్య 
  • ఒక ఏసీ స్థానంలో ఇప్పుడు 3 ఏసీలు వాడుతున్నారన్న ధ‌ర్మాన‌
ఏపీలో విద్యుత్ కోత‌లు భారీ ఎత్తున పెరిగిపోయాయ‌న్న వార్త‌ల‌పై రాష్ట్ర రెవెన్యూ శాఖ మంత్రి ధ‌ర్మాన ప్ర‌సాద‌రావు గురువారం నాడు స్పందించారు. రాష్ట్రంలో విద్యుత్ కోత‌లు నిజ‌మేన‌న్న ధ‌ర్మాన... విప‌రీతంగా పెరిగిపోయిన విద్యుత్ వినియోగ‌మే క‌రెంటు కోత‌ల‌కు కార‌ణంగా నిలుస్తోంద‌ని చెప్పారు. ఈ సంద‌ర్భంగా ఏ రీతిన విద్యుత్ వినియోగం పెరిగింద‌న్న వైనంపైనా ధ‌ర్మాన వివ‌ర‌ణ ఇచ్చారు.

గ‌తంలో ఒక లైటును వినియోగించిన వారు ఇప్పుడు ఏకంగా 10 లైట్ల‌ను వినియోగిస్తున్నార‌ని ధ‌ర్మాన చెప్పారు. అదే స‌మ‌యంలో గ‌తంలో ఒక ఫ్యాన్ ఉన్న చోట ఇప్పుడు నాలుగు ఫ్యాన్లు తిరుగుతున్నాయ‌ని ఆయ‌న వ్యాఖ్యానించారు. అదే రీతిలో ఒక ఏసీ స్థానంలో ఇప్పుడు మూడు ఏసీల‌ను వాడుతున్నారంటూ ధ‌ర్మాన పేర్కొన్నారు. వినియోగం విప‌రీతంగా పెరిగిన కార‌ణంగా ఉత్ప‌త్తి చేస్తున్న విద్యుత్ స‌రిపోవ‌డం లేద‌ని ధ‌ర్మాన స్ప‌ష్టం చేశారు.


More Telugu News