ఎవరికీ రాని వింత ఆలోచనలు జగన్ కు వస్తుంటాయి: తాళ్లవలసలో చంద్రబాబు
- విశాఖలో చంద్రబాబు పర్యటన
- తాళ్లవలసలో టీడీపీ సభ
- బాదుడే బాదుడుకు విరుగుడు టీడీపీనే అని ఉద్ఘాటన
- సైకోల తోకలు కత్తిరిస్తామని వార్నింగ్
టీడీపీ అధినేత చంద్రబాబు విశాఖ పర్యటనలో భాగంగా తాళ్లవలసలో నిర్వహించిన సభలో పాల్గొన్నారు. రుషికొండకు వెళ్లనివ్వకుండా తనను అడ్డుకోవడంపై ప్రభుత్వంపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. రుషికొండ ఎంతో చారిత్రక ప్రాధాన్యం ఉన్న ప్రాంతమని, జగన్ కన్నుపడితే అంతే సంగతులు అంటూ వ్యాఖ్యానించారు.
ఎవరికీ రాని వింత ఆలోచనలు జగన్ కు వస్తుంటాయని, కోడికత్తి, బాబాయి హత్య వంటి ఆలోచనలతో జగన్ గెలిచారని ఎద్దేవా చేశారు. జగన్ పాలనలో గ్రామగ్రామాన ఉన్మాదులు తయారవుతున్నారని, తాము అధికారంలోకి వచ్చాక వాళ్లందరి తోకలు కత్తిరిస్తామని హెచ్చరించారు. గతంలో తాము అడ్డుకుని ఉంటే జగన్ పాదయాత్ర చేయగలిగేవాడా? అని ప్రశ్నించారు.
తాను పోరాడేది తన కోసం కాదని, ప్రజల కోసం అని చంద్రబాబు స్పష్టం చేశారు. జగన్ అమలు చేస్తున్న బాదుడే బాదుడుకు టీడీపీ ఒక్కటే విరుగుడు అని ఉద్ఘాటించారు. జగన్ ను నమ్ముకున్న ఐఏఎస్ అధికారులు జైలు పాలవుతున్నారని, సీఎం కారణంగా ఎనిమిది మంది అధికారులు జైలు శిక్షకు గురయ్యారని పేర్కొన్నారు.