పార్టీలోకి కొత్త వారి చేరికను అడ్డుకోకండి: బీజేపీ నేతలకు జేపీ నడ్డా సూచన
- ప్రణాళికలు లేకుండా నేతల పర్యటనలు వద్దన్న నడ్డా
- క్షేత్ర స్థాయిలో పార్టీని బలోపేతం చేయాలని సూచన
- పార్టీలో ప్రాధాన్యతపై పోలికలు కూడదన్న నడ్డా
బీజేపీ తెలంగాణ అధ్యక్షుడు బండి సంజయ్ చేపట్టిన ప్రజా సంగ్రామ యాత్రలో తొలి దశ యాత్ర ముగింపు సందర్భంగా ఏర్పాటు చేసిన బహిరంగ సభకు హాజరయ్యేందుకు వచ్చిన ఆ పార్టీ జాతీయ అధ్యక్షుడు జగత్ ప్రకాశ్ నడ్డా గురువారం మహబూబ్ నగర్‌లో పార్టీ పదాధికారుల సమావేశాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా పార్టీ నేతలకు ఆయన పలు సలహాలు, సూచనలు చేశారు.
బీజేపీలోకి చేరేందుకు కొత్త వారు వస్తున్నారన్న జేపీ నడ్డా... వారిని ఆహ్వానించాలని, అడ్డుకోరాదని సూచించారు. పార్టీలో తమకు దక్కుతున్న ప్రాధాన్యతను ఇతర నేతలతో పోల్చి చూసుకోవద్దని కూడా ఆయన తెలిపారు. ప్రతి నెలా ప్రణాళికలు సిద్ధం చేసుకుని ముందుకు సాగాలని ఆయన పిలుపునిచ్చారు. ప్రణాళికలు లేకుండా ఏ నేత పర్యటనలు కూడా వద్దని సూచించారు. క్షేత్ర స్థాయిలో పార్టీని బలోపేతం చేసే దిశగా సాగాలని కోరారు. దేశంలోని అన్ని పార్టీలు కుటుంబ పార్టీలేనని, అందుకు భిన్నంగా ఉన్న ఏకైక పార్టీ బీజేపీనేనని నడ్డా తెలిపారు.