చంద్రబాబు వ్యాఖ్యాలకు కౌంటరిచ్చిన ఏపీ డీజీపీ
- తెలుసుకుని మాట్లాడితే బాగుంటుందన్న డీజీపీ
- ఒకట్రెండు ఘటనలతో శాంతిభద్రతలు లేవనడం సరికాదని వ్యాఖ్య
- గంజాయి కట్టడికి పూర్తి స్థాయిలో ప్రణాళికలన్న డీజీపీ
ఏపీలో ఇటీవల చోటుచేసుకున్న అత్యాచారాల ఘటనల నేపథ్యంలో టీడీపీ అధినేత నారా చంద్రబాబునాయుడు వైసీపీ ప్రభుత్వంపై తీవ్రంగా విరుచుకుపడుతున్న సంగతి తెలిసిందే. ఇందులో భాగంగా రాష్ట్రంలో అసలు శాంతి భద్రతలు ఉన్నాయా? అని ప్రశ్నించిన చంద్రబాబు... రాష్ట్రంలో అసలు పోలీసు వ్యవస్థ పనిచేస్తోందా? అని కూడా ప్రశ్నించారు.
చంద్రబాబు వ్యాఖ్యలకు తాజాగా ఏపీ డీజీపీ రాజేంద్రనాథ్ రెడ్డి కౌంటరిచ్చారు. రాష్ట్రంలో జరిగిన ఒకట్రెండు ఘటనలను చూపుతూ రాష్ట్రంలో అసలు శాంతి భద్రతలే లేవంటూ వ్యాఖ్యానించడం సరికాదని డీజీపీ పేర్కొన్నారు. వాస్తవ పరిస్థితులు ఏమిటో తెలుసుకుని మాట్లాడాలని ఆయన చంద్రబాబుకు సూచించారు. రాష్ట్రంలో గంజాయి కట్టడికి పూర్తి ప్రణాళికలతో ముందుకు వెళుతున్నామని డీజీపీ వివరించారు.