స్వల్ప లాభాల్లో ముగిసిన మార్కెట్లు
- మధ్యాహ్నం ఒంటి గంట వరకు దూకుడుగానే కొనసాగిన మార్కెట్లు
- చివరకు 33 పాయింట్లతో ముగిసిన సెన్సెక్స్
- 5 పాయింట్లు లాభపడ్డ నిఫ్టీ
దేశీయ స్టాక్ మార్కెట్లు ఈరోజు స్వల్ప లాభాల్లో ముగిశాయి. ఈరోజు ఉదయం లాభాల్లో ప్రారంభమైన మార్కెట్లు దూకుడుగానే కొనసాగాయి. మధ్యాహ్నం 1 గంట తర్వాత మార్కెట్లు లాభాలను కోల్పోవడం ప్రారంభమయింది. ఒకానొక సమయంలో నష్టాల్లోకి కూడా జారుకుంది.
చివర్లో ఒడిదుడుకులకు లోనైన మార్కెట్లు చివరకు స్వల్ప లాభాల్లో ముగిశాయి. బ్యాంకింగ్, కన్జ్యూమర్ గూడ్స్, ఫార్మా స్టాకులు మార్కెట్లను వెనక్కి లాగాయి. ఈరోజు ట్రేడింగ్ ముగిసే సమయానికి సెన్సెక్స్ 33 పాయింట్లు లాభపడి 55,702కి చేరింది. నిఫ్టీ 5 పాయింట్లు పెరిగి 16,682 వద్ద స్థిరపడింది.
బీఎస్ఈ సెన్సెక్స్ టాప్ గెయినర్స్:
టెక్ మహీంద్రా (4.19%), ఇన్ఫోసిస్ (3.28%), హెచ్సీఎల్ టెక్నాలజీస్ (2.76%), టాటా స్టీల్ (2.10%), విప్రో (1.91%).
టాప్ లూజర్స్:
ఇండస్ ఇండ్ బ్యాంక్ (-4.33%), సన్ ఫార్మా (-2.86%), నెస్లే ఇండియా (-2.75%), అల్ట్రాటెక్ సిమెంట్ (-2.60%), రిలయన్స్ (-1.86%).