బొత్స సత్యనారాయణ రాజీనామా చేయాలి: తులసిరెడ్డి
- పదో తరగతి పరీక్షల్లో లీకేజులు సాధారణ అంశంగా మారాయన్న తులసిరెడ్డి
- విద్యార్థుల పట్ల జగన్ కంస మేనమామలా తయారయ్యారని వ్యాఖ్య
- విద్యా వ్యవస్థను జగన్ ప్రభుత్వం పూర్తిగా నాశనం చేసిందన్న తులసిరెడ్డి
పదో తరగతి పరీక్షల్లో లీకేజీలు, మాస్ కాపీయింగులు సాధారణ అంశంగా మారాయని ఏపీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ తులసిరెడ్డి విమర్శించారు. దీనికి బాధ్యత వహిస్తూ విద్యాశాఖ మంత్రి బొత్స సత్యనారాయణ రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు. మూడు, నాలుగు, ఐదో తరగతులను ఎలిమెంటరీ విద్య నుంచి విడగొట్టి హైస్కూల్ విద్యలో కలపడం ఒక తుగ్లక్ చర్య అని అన్నారు.
దీని వల్ల డ్రాపౌట్స్ పెరుగుతాయని చెప్పారు. విద్యార్థుల పట్ల సీఎం జగన్ కంస మేనమామలా, శకుని మేనమామలా తయారయ్యారని దుయ్యబట్టారు. వైసీపీ ప్రభుత్వం విద్యా వ్యవస్థను పూర్తిగా నాశనం చేసిందని మండిపడ్డారు.
దీని వల్ల డ్రాపౌట్స్ పెరుగుతాయని చెప్పారు. విద్యార్థుల పట్ల సీఎం జగన్ కంస మేనమామలా, శకుని మేనమామలా తయారయ్యారని దుయ్యబట్టారు. వైసీపీ ప్రభుత్వం విద్యా వ్యవస్థను పూర్తిగా నాశనం చేసిందని మండిపడ్డారు.