రాహుల్ హైదరాబాద్ పర్యటన వేళ మరోసారి వైట్ ఛాలెంజ్ కలకలం.. 'నైట్ క్లబ్'లో రాహుల్ ఫొటోలతో ఫ్లెక్సీలు
- గతంలో తెలంగాణలో కలకలం రేపిన వైట్ ఛాలెంజ్
- రేపు రాహుల్ వస్తోన్న నేపథ్యంలో మరోసారి ఈ ఛాలెంజ్‌తో ఫ్లెక్సీలు
- ట్యాంక్ బండ్, గన్ పార్క్ వంటి ప్రాంతాల్లో ఫ్లెక్సీలు
కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ రేపు తెలంగాణకు వస్తున్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో హైదరాబాద్‌లోని ట్యాంక్ బండ్, గన్ పార్క్ వంటి ప్రాంతాల్లో పలు ఫ్లెక్సీలు వెలిశాయి. అందులో వైట్ ఛాలెంజ్ కు సిద్ధమా? అంటూ రాహుల్ గాంధీని ప్రశ్నించారు. అలాగే, రాహుల్ గాంధీ నేపాల్ నైట్ క్లబ్లో ఉన్న ఫొటోను కూడా కొందరు ఫ్లెక్సీల్లో వేయించారు.
గతంలో వైట్ ఛాలెంజ్ అంటూ కాంగ్రెస్, టీఆర్ఎస్ నేతల మధ్య తీవ్ర వాగ్వివాదం చెలరేగిన విషయం తెలిసిందే. హైదరాబాద్ సింగరేణి కాలనీలో జరిగిన ఘటన నేపథ్యంలో అప్పట్లో రాహుల్ వైట్ ఛాలెంజ్‌కు సిద్ధమా? అంటూ మంత్రి కేటీఆర్ సవాల్ విసిరారు. అలాగే, దీనిపై అప్పట్లో టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి స్పందిస్తూ మంత్రి కేటీఆర్‌ను వైట్ ఛాలెంజ్‌కు ప్రతి సవాల్ చేశారు.
అలాగే, టాలీవుడ్ డ్రగ్స్ కేసు సమయంలోనూ ఈ వైట్ ఛాలెంజ్ కలకలం రేపింది. డ్రగ్స్ కేసు నుంచి పలువురు నిందితులను తప్పించేందుకు టీఆర్ఎస్ నేతలు ప్రయత్నిస్తున్నారని కాంగ్రెస్ నేతలు ఆరోపించారు. మంత్రి కేటీఆర్ తో పాటు మాజీ ఎంపీ కొండా విశ్వేశ్వర్ రెడ్డికి రేవంత్ రెడ్డి వైట్ ఛాలెంజ్ విసిరారు. దానిపై స్పందించిన కేటీఆర్ తాను ఏ పరీక్షకైనా సిద్ధమేనని అన్నారు. మళ్లీ ఇప్పుడు వైట్ ఛాలెంజ్ తెరమీదకు రావడం గమనార్హం.