ఉక్రెయిన్ పురుషులు, బాలురపైనా రష్యా సైనికుల లైంగిక దాడులు

  • విచారణలో డజనకుపైగా కేసులు
  • మహిళల మాదిరే పురుషులు సైతం బయటకు చెప్పుకోలేరు
  • బాధితులు మందుకు వచ్చి ఫిర్యాదు చేయాలి
  • ఐక్యరాజ్యసమితి ప్రతినిధి ప్రమీలా ప్యాటెన్
ఉక్రెయిన్ లో రష్యా సైనికులు సాగిస్తున్న దారుణాలు ఒక్కోటీ వెలుగు చూస్తున్నాయి. ఇప్పటి వరకు యువతులు, మహిళలపై రష్యా సైనికుల అత్యాచారం, హత్య ఘటనలు బయటపడ్డాయి. తాజాగా బాలురు, పురుషులపైనా రష్యా సైనికులు లైంగిక దాడులకు పాల్పడినట్టు , వీటిపై దర్యాప్తు నడుస్తోందని ఐక్యరాజ్య సమితితోపాటు, ఉక్రెయిన్ అధికారులు తెలిపారు.

‘‘ఉక్రెయిన్ లో మగవారు, బాలురపై లైంగిక హింసకు సంబంధించి నివేదికలు అందాయి. వీటిని ఇంకా ధ్రువీకరించుకోలేదు’’ అని ఐక్యరాజ్యసమితి ప్రతినిధి ప్రమీలా ప్యాటెన్ కీవ్ లో నిర్వహించిన మీడియా సమావేశంలో ప్రకటించారు. మహిళల మాదిరే, అత్యాచారాన్ని ఎదుర్కొన్న పురుషులు, బాలురు సైతం దాని గురించి బయటపెట్టడం కష్టమేనన్నారు. లైంగిక హింస గురించి బయటకు చెప్పుకునేంత స్వేచ్ఛను వారికి ఇవ్వాలని అభిప్రాయపడ్డారు. డజను సంఖ్యలో కేసులు విచారణలో ఉన్నట్టు చెప్పారు. బాధితులు ముందుకు వచ్చి ఫిర్యాదు చేయాలని పిలుపు నిచ్చారు. 

పురుషులు, మహిళల్లో అన్ని వయసుల వారి పట్ల లైంగిక హింసకు సంబంధించి పలు నివేదికలు తన కార్యాలయానికి వచ్చినట్టు ఉక్రెయిన్ ప్రాసిక్యూటర్ జనరల్ ఇరీనా వెనెడిక్టోవా సైతం ప్రకటించారు. ఉక్రెయిన్ పౌర సమాజాన్ని భయపెట్టేందుకు మాస్కో ఉద్దేశపూర్వకంగా అత్యాచార మార్గాన్ని ఉపయోగించుకుంటోందని ఆరోపించారు.


More Telugu News