రాజధాని అమరావతిపై కోర్టు ధిక్కరణ పిటిషన్.. నేడు విచారించనున్న హైకోర్టు!

  • ఏపీ రాజధాని అమరావతే అని తీర్పును ఇచ్చిన హైకోర్టు
  • హైకోర్టు తీర్పును ఇంత వరకు అమలు చేయని ప్రభుత్వం
  • కోర్టు ధిక్కరణ పిటిషన్ వేసిన రాజధాని రైతులు
ఏపీ రాజధాని అంశం మరోసారి తెరపైకి వచ్చింది. రాజధాని అమరావతే అంటూ ఏపీ హైకోర్టు స్పష్టమైన ఆదేశాలను జారీ చేసిన తర్వాత కూడా... మూడు రాజధానులను ఏర్పాటు చేస్తామంటూ రాష్ట్ర ప్రభుత్వ పెద్దలు చెపుతున్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో హైకోర్టులో మరో పిటిషన్ దాఖలయింది.

 అమరావతిపై హైకోర్టు ఇచ్చిన తీర్పును రాష్ట్ర ప్రభుత్వం అమలు చేయడం లేదని పేర్కొంటూ రాజధాని ప్రాంత రైతులు హైకోర్టులో కోర్టు ధిక్కరణ పిటిషన్ ను దాఖలు చేశారు. ఈ పిటిషన్ ను ఈరోజు హైకోర్టు విచారించనుంది. రైతుల తరపున న్యాయవాది ఉన్నం మురళీధర్ వేసిన ఈ పిటిషన్ ను త్రిసభ్య ధర్మాసనం విచారించబోతోంది. నిధులు లేవనే సాకుతో హైకోర్టు ఇచ్చిన తీర్పును అమలు చేయడంలో ఏపీ ప్రభుత్వం జాప్యం చేస్తోందని పిటిషన్ లో వారు పేర్కొన్నారు.


More Telugu News