తెలుగు రాష్ట్రాల్లో వర్షాలు కురిసే అవకాశం
- ఉపరితల ద్రోణి ప్రభావంతో వర్షాలు
- ఏపీలో ఈదురుగాలులతో కూడిన వర్షాలు
- పలు జిల్లాల్లో పిడుగులు పడే అవకాశం
- తెలంగాణలో ఒకట్రెండు ప్రాంతాల్లో వాన పడే ఛాన్స్
ఉపరితల ద్రోణి ప్రభావంతో తెలుగు రాష్ట్రాల్లో వర్షాలు పడుతున్నాయి. మరో రెండు రోజుల పాటు భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ అధికారులు తెలిపారు. ఆంధ్రప్రదేశ్‌లో ఈదురుగాలులతో కూడిన వర్షాలు కురుస్తాయని చెప్పారు. పలు జిల్లాల్లో పిడుగులు పడే అవకాశమూ ఉందని తెలిపారు.
రైతులు, పశువుల కాపర్లు చెట్ల కింద ఉండకూడదని సూచించారు. అలాగే, తెలంగాణలో ఒకట్రెండు ప్రాంతాల్లో ఉరుములు, మెరుపులతో కూడిన వర్షాలు కురిసే అవకాశం ఉందని తెలిపారు. కాగా, నిన్న ఉదయం తెలుగు రాష్ట్రాల్లో భారీ వర్షాలు కురిసిన విషయం తెలిసిందే. అకాల వర్షాలతో పలు జిల్లాల్లో రైతులు తీవ్రంగా నష్టపోయారు.