రాణించిన బెంగళూరు బ్యాటర్లు... చెన్నై టార్గెట్ ఎంతంటే!
- 20 ఓవర్లలో 173 పరుగులు చేసిన బెంగళూరు
- ఓపెనర్‌గా వచ్చి నిదానంగా ఆడిన కోహ్లీ
- మహేశ్ తీక్షణకు మూడు వికెట్లు
చెన్నై సూపర్ కింగ్స్‌తో జరుగుతున్న మ్యాచ్‌లో బెంగళూరు రాయల్ ఛాలెంజర్స్ బ్యాటర్లు రాణించారు. 20 ఓవర్లలో 8 వికెట్ల నష్టానికి 173 పరుగులు చేశారు. వెరసి చెన్నైకి 174 పరుగుల లక్ష్యాన్ని నిర్దేశించారు.
పూణేలోని మహారాష్ట్ర క్రికెట్ స్టేడియం వేదికగా జరుగుతున్న ఈ మ్యాచ్‌ల్ బెంగళూరు ఇన్నింగ్స్‌ను ప్రారంభించిన విరాట్ కోహ్లీ (30) పరుగులు చేశాడు. అయితే రన్ రేటును బాగా తగ్గించేసిన విరాట్ నెమ్మదిగా బ్యాటింగ్ చేసి నిరాశపరచాడు. విరాట్‌తో కలిసి ఓపెనర్‌గా వచ్చిన కెప్టెన్ డుప్లెసిస్ (38) తన బ్యాటును ఝుళిపించాడు. ఆ తర్వాత మహిపాల్ లోమ్‌రోర్ (42) ఆకట్టుకున్నాడు. రజత్ పటిదార్ (21), దినేశ్ కార్తిక్ (26) పరుగులతో ఫరవాలేదనిపించారు.
ఇక చెన్నై బౌలర్లు జాగ్రత్తగానే బౌలింగ్ చేసి వికెట్లు తీసినా.. పరుగులు మాత్రం భారీగానే సమర్పించుకున్నారు. మహేశ్ తీక్షణ ఒక్కడే మూడు వికెట్లు తీయగా... మొయిన్ అలీ రెండు, ప్రిటోరియస్ ఓ వికెట్ తీసుకున్నాడు. తీక్షణతో పాటు రవీంద్ర జడేజా పొదుపుగానే బౌలింగ్ చేసినా... మిగలిన బౌలర్లు భారీగా పరుగులు సమర్పించుకున్నారు. మరికాసేపట్లో 174 పరుగుల విజయలక్ష్యంతో చెన్నై తన ఇన్నింగ్స్‌ను మొదలుపెట్టనుంది.