కవితపై అరవింద్ ఎదురు దాడి... 'దూద్‌కా దూద్ పానీకా పానీ' అంటూ కౌంటర్
- నిజామాబాద్ వేదికగా అరవింద్‌పై కవిత విమర్శలు
- వేగంగా స్పందించిన నిజామాబాద్ ఎంపీ అరవింద్
- వచ్చే ఎన్నికల్లో కూడా తనపైనే పోటీ చేయాలని కవితకు ఆహ్వానం
2019 సార్వత్రిక ఎన్నికల్లో భాగంగా నిజామాబాద్ ఎంపీ పదవికి పోటీ చేసి ఓడిపోయిన టీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత బుధవారం నాడు నిజామాబాద్ ఎంపీ ధర్మపురి అరవింద్‌పై విమర్శల దాడి చేసిన సంగతి తెలిసిందే. ప్రజా తీర్పును గౌరవించి ప్రజలకు సేవ చేసేందుకు అరవింద్‌కు మూడేళ్ల సమయం ఇచ్చానని చెప్పిన కవిత... ఈ మూడేళ్లలో నిజామాబాద్‌కు అరవింద్ ఏం చేశారని ప్రశ్నించారు.
కవిత విమర్శలకు ధర్మపురి అరవింద్ వేగంగానే స్పందించారు. తన చేతిలో ఎదురైన ఓటమి నుంచి బయటపడేందుకు కవితకు మూడేళ్ల సమయం పట్టిందని అరవింద్ సెటైర్ సంధించారు. ఈ విమర్శల లొల్లి అవసరం లేదని, రైతుల కోసం తాను చేయాల్సింది చేస్తానని, కవిత కూడా తాను చేయాలనుకుంటున్నది చేసుకోవచ్చని తెలిపారు. 2024లో జరిగే ఎన్నికల్లో నిజామాబాద్ నుంచి మళ్లీ తనపైనే పోటీ చేయాలని ఆమెను కోరిన అరవింద్... దూద్ కా దూద్, పానీ కా పానీ హో జాతా అంటూ కవితకు వ్యంగ్యంగా జవాబిచ్చారు.