ముగిసిన డెన్మార్క్ పర్యటన.. ఫ్రాన్స్ కు బయల్దేరిన మోదీ!
- ప్రధాని ప్యారిస్ కు బయల్దేరారని తెలిపిన పీఎంవో
- డెన్మార్క్ తో బంధాలు మరింత బలపడ్డాయన్న విదేశాంగశాఖ
- ఫ్రాన్స్ అధ్యక్షుడితో ప్రధాని చర్చలు జరుపుతారని వెల్లడి
ప్రధాని మోదీ యూరప్ పర్యటనలో ఉన్న సంగతి తెలిసిందే. తాజాగా ఆయన డెన్మార్క్ పర్యటన ముగిసింది. అక్కడి నుంచి ఆయన ఫ్రాన్స్ కు బయల్దేరారు. ప్రధాని ప్యారిస్ కు బయల్దేరినట్టు పీఎంఓ ట్విట్టర్ ద్వారా తెలిపింది. ఫలవంతమైన డెన్మార్క్ పర్యటన తర్వాత ప్రధాని మోదీ ప్యారిస్ కు బయల్దేరారని ట్వీట్ చేసింది.
మరోవైపు భారత విదేశాంగ శాఖ అధికార ప్రతినిధి ఆరిందమ్ బగ్చి ట్విట్టర్ ద్వారా స్పందిస్తూ... ప్రధాని పర్యటనతో డెన్మార్క్ తో ద్వైపాక్షిక బంధాలు మరింత బలోపేతమయ్యాయని చెప్పారు. కోపెన్ హాగెన్ పర్యటన ముగిసిందని అన్నారు. ఫ్రాన్స్ అధ్యక్షుడు ఎమ్యాన్యుయేల్ మాక్రాన్ తో చర్చలు జరిపేందుకు డెన్మార్క్ నుంచి ఫ్యారిస్ కు ప్రధాని బయల్దేరారని చెప్పారు.