ఇంగ్లండ్‌ను కిందకు నెట్టేసిన టీమిండియా.. టీ20ల్లో టాప్ ప్లేస్‌లో రోహిత్ సేన
- 2021-22 ను టాప్ ప్లేస్‌తో ముగించిన టీమిండియా
- ఆ తర్వాత మొదటి స్థానాన్ని చేజిక్కించుకున్న ఇంగ్లండ్
- రోహిత్ కెప్టెన్సీలో వరుసగా సిరీస్‌ల కైవసం
- 270 పాయింట్లతో తిరిగి టాప్ ప్లేస్‌కు చేరిన భారత జట్టు
క్రికెట్‌లో పొట్టి ఫార్మాట్‌గా ప్రసిద్ధికెక్కిన టీ20 ర్యాంకింగ్స్‌లో భారత క్రికెట్ జట్టు తిరిగి తొలి స్థానానికి చేరుకుంది. మొన్నటిదాకా టాప్‌లో కొనసాగిన ఇంగ్లండ్ జట్టును రెండో స్థానానికి నెట్టేసిన టీమిండియా పొట్టి ఫార్మాట్‌లో అగ్రస్థానానికి చేరుకుంది. ఈ మేరకు బుధవారం ఐసీపీ విడుదల చేసిన టీ20 ర్యాంకుల్లో భారత జట్టు తిరిగి తన అగ్రస్థానాన్ని నిలబెట్టుకుంది.
మాజీ కెప్టెన్ విరాట్ కోహ్లీ నేతృత్వంలో టీ20 సిరీస్‌లలో సత్తా చాటిన టీమిండియా 2021-22 ఏడాదిని టాప్ ప్లేస్‌తోనే ముగించింది. అయితే ఆ తర్వాత మంచి ఫామ్‌ను కనబరచిన ఇంగ్లండ్ ఇటీవలే టీమిండియాను రెండో స్థానంలోకి నెట్టేసింది. తాజాగా రోహిత్ శర్మ కెప్టెన్సీలో తిరిగి సత్తా చాటిన టీమిండియా వరుసబెట్టి పొట్టి ఫార్మాట్ సిరీస్‌లను గెలుచుకుంది. ఫలితంగా 270 పాయింట్లతో తిరిగి టీమిండియా టాప్ ప్లేస్‌కు చేరుకుంది. 265 పాయింట్లతో ఇంగ్లండ్ రెండో ర్యాంకులో కొనసాగుతోంది.