కాకాణి మీడియా స‌మావేశంలో నిలిచిన విద్యుత్ స‌ర‌ఫ‌రా

  • విద్యుత్ కోత‌ల‌పై వైసీపీ, టీడీపీల మ‌ధ్య మాట‌ల యుద్ధం
  • స‌చివాల‌యంలో మీడియా స‌మావేశం ఏర్పాటు చేసిన కాకాణి
  • కాకాణి మాట్లాడుతుండ‌గానే నిలిచిన‌ విద్యుత్ స‌ర‌ఫ‌రా
ఏపీలో విద్యుత్ కోత‌లు పెరిగిపోయాయ‌ని విప‌క్షం టీడీపీ ఆరోపిస్తుండ‌గా... అలాంటిదేమీ లేద‌ని వైసీపీ ప్ర‌భుత్వం చెబుతున్న విష‌యం తెలిసిందే. వేస‌వి నేపథ్యంలో విద్యుత్ వినియోగం పెరిగింద‌ని,  ఆ మేర‌కు విద్యుత్ అందుబాటులో లేని కార‌ణంగానే స్వ‌ల్పంగా విద్యుత్ కోత‌లు విధించ‌క త‌ప్ప‌డం లేద‌ని జ‌గ‌న్ స‌ర్కారు చెబుతున్న సంగ‌తి తెలిసిందే. 

ఈ నేప‌థ్యంలో బుధ‌వారం నాడు అమ‌రావ‌తిలోని స‌చివాలయంలో ఓ ఆస‌క్తిక‌ర ఘ‌ట‌న చోటుచేసుకుంది. ఐక్య‌రాజ్య‌స‌మితి నేతృత్వంలోని ఫుడ్ అండ్ అగ్రిక‌ల్చ‌ర్ ఆర్గ‌నైజేష‌న్ (ఎఫ్ఏఓ) అవార్డుకు ఆర్బీకేలు నామినేట్ అయిన విష‌యాన్ని వెల్ల‌డించేందుకు బుధ‌వారం వ్య‌వ‌సాయ శాఖ మంత్రి కాకాణి గోవ‌ర్ధ‌న్ రెడ్డి స‌చివాల‌యంలో మీడియా స‌మావేశం నిర్వ‌హించారు. ఈ స‌మావేశంలో మంత్రి ప్ర‌సంగిస్తున్న స‌మ‌యంలోనే విద్యుత్ స‌ర‌ఫ‌రా నిలిచిపోయింది. ఆ త‌ర్వాత కాసేప‌టికే విద్యుత్ స‌ర‌ఫ‌రా పున‌రుద్ధ‌ర‌ణ కావ‌డంతో కాకాణి త‌న స‌మావేశాన్ని కొన‌సాగించారు.


More Telugu News