సిక్కోలులో చంద్రబాబు.. ఎర్రన్నాయుడి విగ్రహానికి నివాళి అర్పించిన టీడీపీ అధినేత
- శ్రీకాకుళం ముఖద్వారం వద్ద చంద్రబాబుకు ఘన స్వాగతం
- 'బాదుడే బాదుడు' రోడ్ షోలో పాల్గొన్న చంద్రబాబు
- దళ్లవలస కార్యక్రమానికి హాజరు కానున్న టీడీపీ అధినేత
టీడీపీ అధినేత నారా చంద్రబాబునాయుడు బుధవారం సాయంత్రం శ్రీకాకుళం చేరుకున్నారు. శ్రీకాకుళం ముఖద్వారం వద్ద టీడీపీ నేతలు ఆయనకు ఘన స్వాగతం పలికారు. ఆ తర్వాత అక్కడే ఉన్న టీడీపీ దివంగత నేత కింజరాపు ఎర్రన్నాయుడి విగ్రహానికి పూల మాల వేసిన చంద్రబాబు...ఆయనకు నివాళి అర్పించారు. ఆ తర్వాత 'బాదుడే బాదుడు' కార్యక్రమంలో భాగంగా శ్రీకాకుళంలో నిర్వహించిన రోడ్ షోలో చంద్రబాబు పాల్గొన్నారు.
ఏపీలో విద్యుత్, ఆర్టీసీ చార్జీలను పెంచిన వైసీపీ ప్రభుత్వ వైఖరిని నిరసిస్తూ బాదుడే బాదుడు పేరిట టీడీపీ ఆందోళనలకు పిలుపునిచ్చిన సంగతి తెలిసిందే. ఇందులో భాగంగా శ్రీకాకుళం జిల్లా పొందూరు మండలం దళ్లవలసలో పార్టీ జిల్లా శాఖ నిర్వహిస్తున్న బాదుడే బాదుడు కార్యక్రమంలో పాల్గొనేందుకే చంద్రబాబు శ్రీకాకుళం జిల్లాకు వెళ్లారు. మరికాసేపట్లో ఈ కార్యక్రమంలో చంద్రబాబు పాల్గొని ప్రసంగించనున్నారు.