హైదరాబాదులో విద్యుత్ సరఫరాలో సమస్యలెదురైతే.. ఈ నంబర్లకు ఫోన్ చేయండి!
- ఇవాళ తెల్లవారుజామున హైదరాబాద్ సహా తెలంగాణలో భారీ వర్షాలు
- విద్యుత్ అధికారులతో దక్షిణ డిస్కం సీఎండీ సమీక్ష
- హైదరాబాద్ లో ప్రత్యేక కంట్రోల్ రూం
- ప్రజలకు అందుబాటులో పలు నంబర్లు
ఇవాళ తెల్లవారుజామున కురిసిన భారీ వర్షానికి చాలా చోట్ల విద్యుత్ సరఫరాకు అంతరాయం ఏర్పడింది. ఈదురుగాలులతో కూడిన వర్షం పడడంతో విద్యుత్ స్తంభాలపై చెట్లు కూలాయి. దీంతో ఈ పరిస్థితిపై దక్షిణ డిస్కం సీఎండీ రఘుమారెడ్డి కాన్ఫరెన్స్ ద్వారా అధికారులతో సమీక్ష నిర్వహించారు. హైదరాబాద్ లో విద్యుత్ సరఫరా వివరాలను అడిగి తెలుసుకున్నారు.
విద్యుత్ సరఫరా సమస్యలను పరిష్కరించేందుకు ప్రత్యేక కంట్రోల్ రూంను ఏర్పాటు చేశామని రఘుమారెడ్డి చెప్పారు. అత్యవసర పరిస్థితులుంటే 1912 లేదా 100 లేదా స్థానిక ఫ్యూజ్ కాల్ ఆఫీస్ కు ఫోన్ చేయవచ్చని చెప్పారు. వాటితో పాటు 7382072104, 7382072106, 7382071574 నంబర్లకు ఫోన్ చేసి తమ సమస్యలను ఫిర్యాదు చేయవచ్చన్నారు.
చెట్లు కూలిన చోట వాటిని తొలగించి విద్యుత్ ను పున:సరఫరా చేసే ప్రయత్నాల్లో సిబ్బంది ఉన్నారని రఘుమారెడ్డి చెప్పారు. చెట్ల మీద, వాహనాల మీద విద్యుత్ వైర్లు తెగిపడితే వాటిని ముట్టుకోవద్దని సూచించారు. రోడ్ల మీద నిలిచిన నీటిలో కరెంట్ తీగలుగానీ, కరెంట్ పరికరాలుగానీ మునిగితే ఆ ప్రాంతం నుంచి వెళ్లవద్దని సూచించారు.