పంజాబ్ కింగ్స్ బ్యాటింగ్ ఆర్డర్ లో మార్పునకు మయాంక్ నిర్ణయం

  • ఓపెనర్ గా రాని మయాంక్ అగర్వాల్
  • అతడి స్థానంలో బెయిర్ స్టోవ్
  • శిఖర్ ధావన్ తో కలసి ఇన్నింగ్స్ ఆరంభం 
  • ఇక మీదటా ఇదే జోడీ
  • సంకేతాలు ఇచ్చిన కెప్టెన్ మయాంక్
పంజాబ్ కింగ్స్ జట్టు బ్యాటింగ్ ఆర్డర్ లో చేసిన మార్పులు సత్ఫలితాలను ఇచ్చినట్టు కనిపిస్తోంది. ఈ లీగ్ లో ఎంతో బలంగా కనిపిస్తున్న కొత్త జట్టు గుజరాత్ టైటాన్స్ ను మంగళవారం పంజాబ్ కింగ్స్ ఓడించింది. ఈ మ్యాచ్ లో పంజాబ్ కింగ్స్ జట్టు పరంగా మార్పులు చోటు చేసుకున్నాయి. 

మయాంక్ అగర్వాల్ ఓపెనర్ గా రాలేదు. అతని బదులుగా జానీ బెయిర్ స్టోవ్ ఓపెనర్ గా రంగంలోకి దిగాడు. బెయిర్ స్టోవ్ తో కలసి శిఖర్ ధావన్ ఓపెనింగ్ బాధ్యతలు తీసుకున్నాడు. బెయిర్ స్టోవ్ ఒక్క పరుగుకే వెళ్లిపోయినా.. శిఖర్ ధావన్ మాత్రం 62 పరుగులతో నాటవుట్ గా, అజేయంగా నిలిచాడు. 

అతడితో కలసి భానుక రాజపక్స కూడా గుజరాత్ బౌలర్లను ఆడుకున్నాడు. నాలుగో స్థానంలో లియామ్ లివింగ్ స్టోన్ వచ్చాడు. మయాంక్ అగర్వాల్ నాలుగో స్థానంలో రావాలనుకున్నాడు. కానీ తనకంటే ముందే లియామ్ ను పంపించాడు. ఈ అవకాశాన్ని లియామ్ నిరూపించుకున్నాడు. 10 బంతులకే 30 పరుగులు రాబట్టుకున్నాడు. 

మ్యాచ్ అనంతరం మయాంక్ మాట్లాడుతూ.. బెయిర్ స్టోవ్ ను ఓపెనర్ గా.. బ్యాటింగ్ ఆర్డర్ లో లియామ్ ను ముందు పంపించినట్టు చెప్పాడు. జానీ బెయిర్ స్టోవ్ లో అసలైన ఆటను వెలికి తీయాలన్నదే తమ ప్రయత్నంగా పేర్కొన్నాడు. ఇక నుంచి తాము వరుసగా విజయాలు సాధించాల్సి ఉందన్నాడు. ఇక్కడి నుంచి మరిన్ని మార్పులతో టీమ్ లను రూపొందించాలని అనుకుంటున్నట్టు తెలిపాడు.


More Telugu News