రాహుల్ నైట్ క్లబ్ వివాదంపై విజయసాయిరెడ్డికి కౌంటర్ ఇచ్చిన మాణిక్కం ఠాగూర్
- రాహుల్ నేపాల్ పర్యటనపై సాయిరెడ్డి ట్వీట్
- నిజాలు తెలుసుకోవాలంటూ మాణిక్కం ఠాగూర్ ఘాటు రిప్లై
- కరప్ట్ సాయిరెడ్డి అంటూ వైసీపీ ఎంపీని సంబోధించిన వైనం
కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ నేపాల్ పర్యటనలో భాగంగా నైట్ క్లబ్‌కు వెళ్లారంటూ వైరి వర్గాలు విరుచుకుపడుతున్న సంగతి తెలిసిందే. అంతకంతకూ పెరిగిపోతున్న చైనా హనీట్రాప్‌ల నేపథ్యంలో.. నైట్ క్లబ్‌లో నేపాల్‌లో చైనా రాయబారి హౌ యాంగిని రాహుల్ కలిశారంటూ వైసీపీ ఎంపీ విజయసాయిరెడ్డి ట్వీట్ చేసిన సంగతి తెలిసిందే.
ఈ ట్వీట్‌పై కాంగ్రెస్ పార్టీ తెలంగాణ వ్యవహారాల ఇంచార్జీ మాణిక్కం ఠాగూర్ ఘాటుగా స్పందించారు. ఈ మేరకు సాయిరెడ్ది ట్వీట్‌కు కౌంటర్‌గా ఆయన రీ ట్వీట్ చేశారు. ఈ ట్వీట్‌లో సాయిరెడ్డిని 'కరప్ట్ సాయిరెడ్డి' అంటూ ఆయన సంబోధించారు.
సాయిరెడ్డి నిజం తెలుసుకోవాలని ఆయన సూచించారు. సాయిరెడ్డి సమస్య జగన్‌పై నమోదైన కేసులేనన్న ఠాగూర్... ఈ కారణంగా తన బాస్‌ను నిత్యం సంతోషంగా ఉండేలా చూసుకుంటున్నారని ఎద్దేవా చేశారు. అయితే నిజాన్ని మరువవద్దని సూచించిన ఠాగూర్.. నేపాల్ రాయబారి కుమార్తె వివాహ వేడుకకు హాజరయ్యేందుకే రాహుల్ నేపాల్ వెళ్లారని తెలిపారు.
అసలు ఓ రాయబారి కుమార్తె పెళ్లికి వెళ్లడంలో తప్పేముంది? అంటూ కూడా ఆయన ప్రశ్నించారు. ఈ మేరకు రాహుల్ నేపాల్ పర్యటనకు సంబంధించి ఖాట్మండు పోస్టు రాసిన కథనాన్ని కూడా తన ట్వీట్‌కు ఠాగూర్ జత చేశారు.