నాతో భేటీకి పుతిన్ అంగీక‌రించ‌డం లేదు: పోప్ ఫ్రాన్సిస్‌

  • యుద్ధం మొద‌లుకాగానే పుతిన్‌తో భేటీకి పోప్ ప్ర‌తిపాద‌న‌
  • ర‌ష్యా రాయ‌బార కార్యాల‌యానికి స్వ‌యంగా వెళ్లిన పోప్‌
  • ఇప్ప‌టిదాకా ర‌ష్యా నుంచి స్పంద‌నే లేద‌ని ఆవేద‌న‌
  • యుద్ధం విర‌మ‌ణ ఒక్క పుతిన్‌తోనే సాధ్య‌మ‌ని వ్యాఖ్య  
ఉక్రెయిన్‌పై కొన‌సాగిస్తున్న యుద్ధంపై త‌న‌తో చ‌ర్చించేందుకు ర‌ష్యా అధ్య‌క్షుడు వ్లాదిమిర్ పుతిన్‌ అంగీక‌రించ‌డం లేద‌ని పోప్ ఫ్రాన్సిస్ మంగ‌ళ‌వారం నాడు కీల‌క వ్యాఖ్య‌లు చేశారు. అస‌లు ఇక ముందైనా పుతిన్ త‌న‌తో భేటీకి అంగీక‌రిస్తారో, లేదోన‌న్న భ‌యం త‌న‌లో ఉంద‌ని కూడా పోప్ అన్నారు. మంగ‌ళ‌వారం ఓ ప‌త్రిక‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో పుతిన్ తో భేటీ కోసం తాను చేసిన య‌త్నాలు, అందుకు పుతిన్ నుంచి ఇప్ప‌టికీ రాని స్పంద‌న‌పై పోప్ ఆస‌క్తిక అంశాల‌ను వెల్ల‌డించారు. 

ఉక్రెయిన్‌పై రష్యా యుద్ధం మొద‌లుకాగానే... పోప్ ర‌ష్యా రాయ‌బార కార్యాల‌యానికి వెళ్లారు. యుద్ధంపై పుతిన్‌తో తాను చ‌ర్చించాల‌నుకుంటున్నాన‌ని, ఆ స‌మాచారాన్ని పుతిన్‌కు చేర‌వేయాల‌ని ఆయ‌న ర‌ష్యా రాయ‌బార కార్యాల‌యాన్ని కోరారు. అయితే ఇప్ప‌టిదాకా ర‌ష్యా నుంచి త‌న‌కు ఎలాంటి స‌మాచారం రాలేద‌ని ఆయ‌న ఆవేద‌న వ్య‌క్తం చేశారు. 

ఉక్రెయిన్‌తో జ‌రుగుతున్న ర‌ష్యా యుద్ధాన్ని నిలువ‌రించగ‌లిగే శ‌క్తి ఒక్క పుతిన్‌కు మాత్ర‌మే ఉంద‌ని చెప్పిన పోప్‌... ఉక్రెయిన్ రాజ‌ధాని కీవ్‌ను ఇప్పుడ‌ప్పుడే సంద‌ర్శించే అవ‌కాశం లేద‌న్నారు. ముందు పుతిన్‌తో చ‌ర్చిస్తే... యుద్ధం విర‌మ‌ణ‌కు ప‌రిష్కారం దొరుకుతుందన్న ఆశాభావాన్ని వ్య‌క్తం చేసిన పోప్‌.. అంత‌కుముందు ఎన్ని య‌త్నాలు చేసినా ఫ‌లితం లేద‌ని తెలిపారు.


More Telugu News