మొదటి భార్య అంగీకారంతో మళ్లీ పెళ్లి చేసుకున్న మాజీ క్రికెటర్... ఫొటోలు వైరల్!
- లేటు వయసులో అరుణ్ లాల్ రెండో పెళ్లి
- కోల్ కతా యువతి బుల్ బుల్ సాహాతో పెళ్లి
- అరుణ్ లాల్ వయసు 66 ఏళ్లు
- బుల్ బుల్ వయసు 28 ఏళ్లు
భారత మాజీ క్రికెటర్ అరుణ్ లాల్ లేటు వయసులో రెండో పెళ్లి చేసుకున్నాడు. 66 ఏళ్ల అరుణ్ లాల్ 28 ఏళ్ల ఉపాధ్యాయని బుల్ బుల్ సాహాను వివాహం చేసుకున్నాడు. ఈ పెళ్లికి అరుణ్ లాల్ మొదటి భార్య రీనా అంగీకారం తెలపడం విశేషం. రీనా చాలాకాలంగా అనారోగ్యంతో బాధపడుతోంది. కొంతకాలం కిందట అరుణ్ లాల్, రీనా విడాకులు తీసుకున్నప్పటికీ కలిసే ఉంటున్నారు.
ఈ నేపథ్యంలో, అరుణ్ లాల్ కు సాహాతో పరిచయం ఏర్పడి, ప్రేమగా మారింది. వీరి ప్రేమను రీనా కూడా ప్రోత్సహించింది. దాంతో తన వయసులో సగం ఉన్న బుల్ బుల్ సాహాతో అరుణ్ లాల్ నిశ్చితార్థం గత నెలలో జరిగింది. తాజాగా వీరి పెళ్లి మే 2న కోల్ కతాలో జరిగింది. వీరి పెళ్లికి కుటుంబ సభ్యులు, కొద్దిమంది సన్నిహితులు హాజరయ్యారు. తమ పెళ్లి ఫొటోలను బుల్ బుల్ సాహా తన ఫేస్ బుక్ అకౌంట్ లో పంచుకోవడంతో వైరల్ అయ్యాయి.
అరుణ్ లాల్ 80వ దశకంలో భారత జట్టులో సభ్యుడు. 1989లో వెస్టిండీస్ పై తన కెరీర్ చివరి టెస్టు ఆడిన ఈ బెంగాలీ ఆటగాడు ఆపై ఆటకు గుడ్ బై చెప్పాడు. ప్రస్తుతం అరుణ్ లాల్ బెంగాల్ రంజీ టీమ్ కు ప్రధాన కోచ్ గా వ్యవహరిస్తున్నాడు.
.