కేఏ పాల్ ను హౌస్ అరెస్ట్ చేసిన పోలీసులు
- సిరిసిల్లలో నిన్న కేఏ పాల్ పై దాడి
- డీజీపీకి ఫిర్యాదు చేసేందుకు ఇంటి నుంచి బయల్దేరిన పాల్
- ఇంటి వద్దే అడ్డుకున్న పోలీసులు
ప్రజాశాంతి పార్టీ అధ్యక్షుడు, ప్రముఖ క్రైస్తవ మత ప్రబోధకుడు కేఏ పాల్ ను హైదరాబాద్ పోలీసులు హౌస్ అరెస్ట్ చేశారు. అపాయింట్ మెంట్ లేకుండా డీజీపీని కలవడానికి ఆయన బయల్దేరుతున్నట్టు సమాచారం అందుకున్న పోలీసులు ఆయనను అమీర్ పేట్ లోని నివాసం వద్దే నిలువరించారు. ఆయనను ఇంటి నుంచి బయటకు పంపించలేదు.
సిరిసిల్లలో నిన్న కేఏ పాల్ పై దాడి జరిగిన సంగతి తెలిసిందే. టీఆర్ఎస్ కార్యకర్త ఒకరు ఆయనపై దాడి చేశారు. ఈ ఘటనపై డీజీపీకి ఫిర్యాదు చేసేందుకు పాల్ వెళ్తున్న నేపథ్యంలోనే ఆయనను పోలీసులు గృహ నిర్బంధం చేశారు. కేఏ పాల్ ఇంటి నుంచి బయటకు వస్తే శాంతిభద్రతలకు విఘాతం కలిగే అవకాశం ఉండొచ్చని అధికారులు భావించారు. మరోవైపు రంజాన్ నేపథ్యంలో డీజీపీ మహేందర్ రెడ్డి తన కార్యాలయానికి రాకపోవడం గమనార్హం.