'గ‌డ‌ప‌గ‌డ‌ప‌కూ వైసీపీ' వాయిదాకు కార‌ణం చెప్పిన ఏపీ హోం మంత్రి

  • వాయిదా ప‌డిన 'గ‌డ‌ప‌గ‌డ‌ప‌కూ వైసీపీ' కార్యక్రమం 
  • జ‌నం వ్య‌తిరేక‌తే కార‌ణ‌మంటున్న విప‌క్షాలు
  • స‌చివాల‌యాల నుంచి డేటా జాప్య‌మే కార‌ణ‌మ‌న్న వ‌నిత‌
ఏపీలో అధికార పార్టీ వైసీపీ నిర్వ‌హించ‌త‌ల‌పెట్టిన గ‌డ‌ప‌గ‌డ‌ప‌కూ వైసీపీ కార్య‌క్ర‌మాన్ని ఆ పార్టీ వాయిదా వేసింది. ప్ర‌భుత్వంపై పెరుగుతున్న వ్య‌తిరేకత కార‌ణంగా జ‌నంలోకి వెళ్లేందుకు భ‌య‌ప‌డుతున్న కార‌ణంగానే వైసీపీ ఈ కార్య‌క్ర‌మాన్ని వాయిదా వేసింద‌ని విప‌క్షాలు ఆరోపిస్తున్న సంగ‌తి తెలిసిందే. ఈ నేప‌థ్యంలో ఈ కార్య‌క్ర‌మం వాయిదా ప‌డ‌టానికి గ‌ల కార‌ణాల‌ను ఏపీ హోం శాఖ మంత్రి తానేటి వ‌నిత మంగ‌ళవారం వెల్ల‌డించారు. 

రాష్ట్రంలో ప్ర‌తి కుటుంబానికి ఒక‌టి నుంచి ఐదు సంక్షేమ ప‌థ‌కాల‌ను అందిస్తున్నామ‌ని చెప్పిన తానేటి వ‌నిత‌... గ‌డ‌ప‌గ‌డ‌ప‌కూ వైసీపీ కార్య‌క్ర‌మంలో భాగంగా ల‌బ్ధిదారుల ఇళ్ల‌కు వెళ్లిన సంద‌ర్భంగా ఆయా కుటుంబాల‌కు ఏఏ ప‌థ‌కాల‌ను అందిస్తున్నామ‌న్న విష‌యాన్ని వివ‌రించేందుకు స‌చివాల‌యాల నుంచి డేటాను కోరామ‌ని చెప్పారు. ఆ డేటా ఇంకా పూర్తిగా త‌మ చేతికి రాని నేప‌థ్యంలోనే ఈ కార్య‌క్ర‌మాన్ని వాయిదా వేశామ‌ని ఆమె చెప్పారు. అంతేగానీ... ఎవ‌రో ఇబ్బంది పెడతార‌ని మాత్రం ఈ కార్య‌క్ర‌మాన్ని వాయిదా వేయ‌లేద‌ని ఆమె తెలిపారు.


More Telugu News