రాజీవ్ తో కలిసి నటించే ఛాన్స్ వచ్చింది కానీ .. : సుమ
- సుమ ప్రధానమైన పాత్రను పోషించిన 'జయమ్మ పంచాయితీ'
- ఈ నెల 6వ తేదీన విడుదలవుతున్న సినిమా
- ప్రమోషన్స్ తో బిజీగా ఉన్న సుమ
- హారర్ .. కామెడీ చేయాలనుందంటూ వెల్లడి
మొదటి నుంచి కూడా బుల్లితెరకి ప్రాధాన్యతనిస్తూ వచ్చిన సుమ, ఇప్పుడు 'జయమ్మ పంచాయితీ' సినిమా చేసింది. ఈ నెల 6వ తేదీన ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రానుంది. గ్రామీణ నేపథ్యంలో సహజంగా కనిపించే సంఘటనల చుట్టూ అల్లిన కథ ఇది. ఈ సినిమా ప్రమోషన్స్ లో సుమ బిజీగా ఉంది.
తాజా ఇంటర్వ్యూలో ఆమె మాట్లాడుతూ .. " టీవీ షోస్ లో నేనేమిటనేది నిరూపించుకున్నాను. కానీ ఇకపై సినిమాల్లో కూడా మంచి అవకాశాలు రావాలంటే .. నన్ను దృష్టిలో పెట్టుకుని కథలు .. పాత్రలు రాయాలంటే ఈ సినిమా బాగా ఆడాలి. అలాంటి ఒక రిజల్ట్ కోసమే నేను వెయిట్ చేస్తున్నాను. ఈ నెల 6న ప్రేక్షకులు ఏం చెబుతారో చూడాలి మరి.
ఓటీటీ నుంచి కూడా ఒక ఆఫర్ వచ్చింది. నేను .. రాజీవ్ కలిసి చేయాలనుకున్నాము. డేట్స్ కుదరక చేయలేకపోయాము. భవిష్యత్తులో ఓటీటీ ప్రాజెక్టులు చేసే అవకాశం ఉంది. సినిమా కథల పరంగా చూసుకుంటే హారర్ .. కామెడీ చేయాలనుంది. అలాగే మాటకి మాట పంచ్ లు వేసే పాత్రలను చేయాలనుంది. అలాంటి పాత్రలు చేసే ఛాన్స్ వస్తుందేమో చూడాలి"
అంటూ చెప్పుకొచ్చింది.