ఈద్ ప్రార్థనల్లో పాల్గొన్న మమతా బెనర్జీ

  • కోల్ కతాలో ఈద్ ప్రార్థనల్లో పాల్గొన్న మమత
  • దేశ పరిస్థితి ఏమాత్రం బాగోలేదని వ్యాఖ్య
  • విభజించి పాలించే రాజకీయాలు దేశాన్ని నాశనం చేస్తున్నాయని ఆవేదన
రంజాన్ సందర్భంగా పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ ఈద్ ప్రార్థనల్లో పాల్గొన్నారు. కోల్ కతాలోని రైన్ డ్రెంచ్డ్ రెడ్ రోడ్ లో జరిగిన ప్రార్థనల్లో ఆమె పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ బీజేపీపై నిప్పులు చెరిగారు. దేశంలో ప్రస్తుతం పరిస్థితి ఏమాత్రం బాగోలేదని అన్నారు. విభజించి పాలించే రాజకీయాలు దేశాన్ని నాశనం చేస్తున్నాయని చెప్పారు. 

మతసామరస్యంలో పశ్చిమబెంగాల్ యావత్ దేశానికే ఒక ఉదాహరణగా నిలిచిందని అన్నారు. ఏకత్వం అనేది బెంగాలో ఉందని... దేశంలోని ఏ ఇతర ప్రాంతంలో ఇది కనిపించదని చెప్పారు. అందుకే తామంటే బీజేపీకి నచ్చదని, అందుకే వారు తమను దుర్భాషలాడుతున్నారని అన్నారు. మరోవైపు అక్కడ జరిగిన ఈద్ ప్రార్థనలకు దాదాపు 14 వేల మంది హాజరయ్యారు.


More Telugu News