రీఫర్బిష్డ్ మొబైల్ ఫోన్ కొంటున్నారా..? ఇవి తెలుసుకోండి..
- కొత్తగా మెరుగులు అద్దుకున్నవే రీఫర్బిష్డ్ ఫోన్లు
- విశ్వసనీయ వేదికల నుంచే కొనుగోలు చేయాలి
- వారంటీ ఉంటేనే తీసుకోవాలి
- ఐఎంఈఐ నంబర్ చెక్ చేసుకోవాలి
రీఫర్బిష్డ్ మొబైల్ ఫోన్స్ గురించి వినే ఉంటారు. ఫ్లిప్ కార్ట్, అమెజాన్ తమ పోర్టల్స్ పైన వీటిని విక్రయిస్తున్నాయి. వీటిని కొనుగోలు చేసుకోవచ్చా? అంటే అది వినియోగదారు అభిరుచులపైనే ఆధారపడి ఉంటుంది. 2020తో పోలిస్తే 2021లో రీఫర్బిష్డ్ ఫోన్ల అమ్మకాలు 15 శాతం పెరిగినట్టు ఓ నివేదిక ప్రకటించింది.
రీఫర్బిష్డ్ ఫోన్ అంటే..
అప్పటికే కొంత కాలం పాటు వినియోగించిన ఫోన్లు ఇవి. ఏదైనా కారణంతో వాటిని విక్రయించగా.. కొన్ని సంస్థలు తయారీదారు వద్దకు పంపించి వాటిని నవీకరింప జేస్తాయి. ఫోన్ కండీషన్ ను పూర్తిగా తనిఖీ చేయించి, సమస్యలు ఏవైనా ఉంటే సరి చేయిస్తాయి. ఈ విభాగంలో యాపిల్ అత్యంత ప్రజాదరణ పొందిన బ్రాండ్ గా ఉంది. ఆ తర్వాత స్థానంలో శామ్ సంగ్ ఉంది.
కొనుగోలు చేసే ముందు..
రీఫర్బిష్డ్ ఫోన్లకు వారంటీ ఉంటుంది. కాకపోతే కొత్త ఫోన్లకు ఏడాది వారంటీ ఉంటే, రీఫర్బిష్డ్ ఫోన్లకు ఆరు నెలల వరకు వారంటీ లభిస్తుంది. రీఫర్బిష్డ్ ఫోన్లు ఎక్కువగా ఏదో ఒక సమస్యతో తయారీదారు వద్దకు వెళ్లి రిపేర్ చేయించుకుని వచ్చిన ఫోన్లుగా చూడాలి. కనుక వారంటీ లేకుండా వీటిని కొనుగోలు చేయవద్దు. తర్వాత ఏదైనా సమస్య కనిపిస్తే నష్టపోవాల్సి వస్తుంది.
నెట్ వర్క్ లాక్
రీఫర్బిష్డ్ ఫోన్లను కొనుగోలు చేసే వారు వాటికి నెట్ వర్క్ లాక్ ఏమైనా పడిందేమో ముందే చెక్ చేసుకోవాలి. తమ సిమ్ కార్డు వేసి చూసుకుంటే తెలుస్తుంది. విదేశాల నుంచి వచ్చినవి అయితే మన నెట్ వర్క్ లకు సపోర్ట్ చేస్తాయా? లేదా అన్నది సిమ్ వేసి చూసుకుంటేనే తెలుస్తుంది.
నమ్మకమైన వేదికలు
ఈ ఫోన్లను తెలియని వ్యక్తులు, తెలియని వేదికల ద్వారా కొనుగోలు చేయవద్దు. అమెజాన్, ఫ్లిప్ కార్ట్ వంటి పేరున్న సంస్థల నుంచి కొనుగోలు చేసుకోవచ్చు. దీనివల్ల ఇన్వాయిస్, వారంటీ, కస్టమర్ సర్వీసు లభిస్తాయి.
చోరీ అయిన ఫోన్లు
రీఫర్బిష్డ్ మార్కెట్ కు వచ్చే వాటిల్లో చోరీ అయిన ఫోన్లు కూడా ఉండొచ్చు. అందుకని వీటికి సంబంధించి ఒరిజినల్ బిల్లు తీసుకోవాలి. ఫోన్ ఒరిజినల్ బాక్స్ తీసుకోవాలి. బాక్స్ పై, బిల్లులో ఉన్న ఐఎంఈఐ నంబర్, ఫోన్ లోని ఐఎంఈఐ నంబర్ ఒక్కటేనని ధ్రువీకరించుకోవాలి. పైగా ఇలా తీసుకునే ఫోన్ అసలు కంపెనీ తయారు చేసిందేనా? లేక ఆ పేరుతో చైనా నుంచి వచ్చిన నకిలీ ఫోనా? అన్నది కూడా చెక్ చేసుకోవాలి.
రిటర్న్ ఆప్షన్
రీఫర్బిష్డ్ ఫోన్ తీసుకున్న తర్వాత అందులో ఏదైనా లోపం గుర్తిస్తే రీప్లేస్ చేసుకోవడం, లేదంటే రిటర్న్ ఆప్షన్ ఉందేమో చూసుకోవాలి.