హాల్ మార్క్ గుర్తులో మార్పులు.. వీటికి హాల్ మార్క్ మినహాయింపు

  • నాలుగు గుర్తుల స్థానంలో మూడు 
  • 2 గ్రాములకు తక్కువ ఉన్న ఆభరణాలకు మినహాయింపు
  • కాయిన్లకూ వర్తించదు
బంగారం ఆభరణాల స్వచ్ఛతను సూచించే హాల్ మార్క్ లో చిన్న మార్పు చోటు చేసుకుంది. 2021 జూన్ 16 నుంచి దేశవ్యాప్తంగా 18, 22 క్యారట్ బంగారం ఆభరణాలకు హాల్ మార్క్ ను తప్పనిసరి చేశారు. గతంలో హాల్ మార్క్ గుర్తులో నాలుగు చిహ్నాలు ఉండేవి. వాటిని ఇప్పుడు మూడింటికి తగ్గించారు. 

బీఐఎస్ హాల్ మార్క్ లోగో ఉంటుంది. ప్యూరిటీ/ఫిట్ నెస్ గ్రేడ్ కూడా కనిపిస్తుంది. ఉదాహరణకు 22కే916 అని 22 క్యారట్ల ఆభరణంపై ఉంటుంది. ఇక మూడో గుర్తుగా.. 6 అంకెల కోడ్ ఉండాలి. భారతీయ ప్రమాణాల మండలి నిబంధనల ప్రకారం.. కొన్ని రకాల ఆభరణాలను హాల్ మార్కింగ్ నుంచి మినహాయింపు కల్పించారు. 

  • రెండు గ్రాముల కంటే తక్కువ బరువున్న బంగారం ఆభరణాలు
  • బంగారం థ్రెడ్ తో కూడిన ఆభరణాలు
  • కుందన్, పోల్కి, జడావు తదితర ఆభరణాలు
  • బార్ రూపంలో లేదా ప్లేట్, షీట్, ఫాయిల్, రాడ్, వైర్, కాయిన్, ట్యూబ్ రూపంలో ఉన్న వాటికీ వర్తించదు. 
  • వైద్య అవసరాలు, దంతాలకు, శాస్త్ర సంబంధ, ఇతర పారిశ్రామిక అవసరాలకు వినియోగించే వాటికి హాల్ మార్క్ అక్కర్లేదు.
  • అంతర్జాతీయ ఎగ్జిబిషన్ల కోసం ఉద్దేశించిన ఆభరణాలకూ మినహాయింపు ఉంది.
  • వార్షికంగా రూ.40 లక్షల టర్నోవర్ ఉన్న ఆభరణాల వ్యాపారులకు హాల్ మార్క్ తప్పనిసరి నిబంధన అమలు కాదు. 
  • విదేశాలకు ఎగుమతి చేసే ఆభరణాలకూ ఇదే అమలు కానుంది.


More Telugu News